Gold&Silver Price On Nov 16th: షాకిస్తోన్న బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల

షాకిస్తోన్న బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల

పండుగ పూట దిగి వచ్చిన బంగారం ధరలు అలానే కొనసాగుతాయి అని భావించిన వారికి భారీ షాక్‌ తగిలింది. క్రితం సెషన్‌లో పెరిగిన గోల్డ్‌ రేటు నేడు కూడా అదే దారిలో పయనించింది. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి అంటే..

పండుగ పూట దిగి వచ్చిన బంగారం ధరలు అలానే కొనసాగుతాయి అని భావించిన వారికి భారీ షాక్‌ తగిలింది. క్రితం సెషన్‌లో పెరిగిన గోల్డ్‌ రేటు నేడు కూడా అదే దారిలో పయనించింది. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి అంటే..

పండుగ పూట పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగించిన బంగారం ధరలు ప్రస్తుతం షాక్‌ ఇస్తున్నాయి. అసలే వివాహాల సీజన్‌ ప్రారంభం అయ్యింది. గోల్డ్‌కు భారీ డిమాండ్‌ ఉండే సమయం. పెళ్లి అంటే కచ్చితంగా ఎంతో కొంత పుత్తడి కొనుగోలు చేస్తారు. అసలు మన దగ్గర గోల్డ్‌ లేకుండా వివాహాలు జరగవు. దాంతో ఈ సీజన్‌లో బంగారానికి భారీ డిమాండ్‌ ఉంటుంది. అయితే పండగల వేళ గోల్డ్‌ ధర దిగి రావడంతో.. ఇదే పంథా కొనసాగుతుంది.. బంగారం కొనవచ్చు అని భావించే వారికి.. ఒక్కసారిగా భారీగా షాక్‌ తగిలింది. దీపావళి పండగ వరకు దిగి వచ్చిన గోల్డ్‌ ధర.. ప్రస్తుతం భారీగా పెరుగుతోంది. ఇక వెండి రేటు కూడా ఒక్కసారిగా జంప్‌ అయ్యి.. పసిడి ప్రియులకు ఊహించని షాక్‌ ఇచ్చింది. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయి అంటే..

దీపావళి పండుగ వరకు దిగి వచ్చిన బంగారం ధర ప్రస్తుతం పెరుగతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా గోల్డ్‌ రేటు పెరిగింది. నేడు భాగ్యనగరంలో బంగారు ఆభరణాల తయారికి వినియోగించే 22 క్యారెట్‌ పుత్తడి రేటు 10 గ్రాముల మీద 400 రూపాయలు పెరిగింది. దాంతో నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర రూ. 55,950కి చేరింది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం ధర కూడా పది గ్రాముల మీద రూ.440 పెరిగి రూ. 61,040 వద్ద ట్రేడవుతోంది.

ఇక ఢిల్లీలో కూడా నేడు పుత్తడి ధర భారీగా పెరిగింది. ఇవాళ హస్తినలో 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద 400 రూపాయలు పెరిగి.. రూ.56,100 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర పది గ్రాముల మీద 440 రూపాయలు పెరిగి.. ప్రస్తుతం రూ.61,119 వద్ద అమ్ముడవుతోంది.

భారీగా పెరిగిన వెండి ధర..

నేడు వెండి ధర బంగారంతో పోటీ పడుతూ భారీగా పెరుగుతోంది. గడిచిన రెండు రోజుల్లోనే కిలో వెండి రేటు ఏకంగా రూ. 2300 పెరిగింది. ఇక ఇవాళ ఒక్కరోజే రూ. 1700 పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో కిలో సిల్వర్‌ రేటు రూ. 74,700 కు పెరిగింది. ఇక హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో సైతం వెండి ధర భారీగానే పెరిగింది. నేడు భాగ్యనగరంలో వెండి ధర కిలో మీద 1700 రూపాయలు పెరిగి.. ప్రస్తుతం 77,700 రూపాయల వద్ద అమ్ముడవుతోంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. నేడు ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు 1959 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఇవాళ స్పాట్ సిల్వర్ రేటు 23.47 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Show comments