Success story of Blue Smart Cabs: స్టార్టప్ తో ఓలా, ఉబర్ లను వెనక్కి నెట్టిన ఇద్దరు మిత్రుల కథ..

స్టార్టప్ తో ఓలా, ఊబర్ లను వెనక్కి నెట్టిన ఇద్దరు మిత్రుల కథ..

స్టార్టప్ తో ఓలా ఉబర్ లను అధిగమించి దూసుకెళ్తున్నారు ఇద్దరు మిత్రులు. వారికి వచ్చిన ఒక్క ఆలోచన నేడు విజయపథంలో స్టార్టప్ కంపెనీనీ ముందుకు తీసుకెళ్తుంది.

స్టార్టప్ తో ఓలా ఉబర్ లను అధిగమించి దూసుకెళ్తున్నారు ఇద్దరు మిత్రులు. వారికి వచ్చిన ఒక్క ఆలోచన నేడు విజయపథంలో స్టార్టప్ కంపెనీనీ ముందుకు తీసుకెళ్తుంది.

ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అయితే ఆ ఆలోచనను ఆచరణలో పెడితేనే విజయం వరిస్తుంది. లేదంటే ఉపయోగం ఉండదు. నేడు గొప్ప గొప్ప సంస్థలు కానీ, మంచి పేరున్న వ్యక్తులు గానీ సక్సెస్ సాధించడానికి కారణం వారి ఆలోచనలను ఆచరణలో పెట్టడమే. ఇదే విధంగా ఓ వ్యక్తికి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ఆదరణ లభించబోతోందన్న ఆలోచన వచ్చిన వెంటనే ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీస్ ను ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇదే ఆలోచనను తన ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నాడు. ఇంకేముంది. వారు అనుకున్నట్లుగానే ఓ స్టార్టప్ ను ప్రారంభించారు. నేడు ఓలా, బర్ లను అధిగమించి దూసుకెళ్తున్నారు. ఆ సక్సెస్ స్టోరీ మీకోసం..

రవాణా రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ రవాణాతో పాటు, ప్రైవేట్ రవాణా కూడా అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ప్రయాణం సులభం అయిపోయింది. ప్రైవేట్ రవాణా రంగంలో ఓలా, బర్ వంటి సంస్థలు తమ సర్వీసులను ప్రారంభించి అనతి కాలంలోనే దిగ్గజ కంపెనీలుగా నిలిచాయి. అయితే వీటికి పోటీగా బ్లూ స్మార్ట్ క్యాబ్స్ సర్వీస్ ను ప్రారంభించారు ఇద్దరు స్నేహితులు. ఓలా, ఉబర్ లను దాటుకుని దూసుకెళ్తున్నారు. పునీత్ గోయల్ అనే బిజినెస్ మ్యాన్ 2017లో సోలార్ పవర్ ప్లాంట్ విజయవంతంగా కొనసాగుతున్నారు. ఒకానొక సందర్భంలో ఉబెర్ సీఈవోతో జరిగిన మీటింగ్ లో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు ఉండే డిమాండ్ ను పునీత్ గోయల్ పసిగట్టాడు. దీంతో భారత్ లో పూర్తిగా ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీస్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన ఆలోచనను జెన్సాల్ ఇంజనీరింగ్ కు చెందిన అమోల్ జగ్గికి తెలియజేశాడు.

ఇక 2019లో బ్లూ స్మార్ట్ క్యాబ్స్ సర్వీస్ పేరిట ఎలక్ట్రిక్ కార్ల హెయిలింగ్ సేవలను ఆ ఇద్దరు స్నేహితులు ప్రారంభించారు. ప్రారంభంలో మొదట ఉబెర్ ప్లాట్‌ఫామ్‌లో పనిచేసింది. ఆ తర్వాత సొంత యాప్‌ను రూపొందించడానికి స్టార్ట్-అప్‌కు మార్గం సుగమం అయ్యింది. ఒక స్వతంత్ర సంస్థగా ఉద్భవించి.. ధరల పెరుగుదల, రైడ్స్ రద్దు వంటి సమస్యలను పరిష్కరించి షెడ్యూల్డ్ రైడ్‌లను ప్రవేశపెట్టింది బ్లూ స్మార్ట్ క్యాబ్స్. తన ఎలక్ట్రిక్ కార్ల ఫ్లీట్ కోసం ఛార్జింగ్ సూపర్‌హబ్‌లను ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం 4,000 ఛార్జింగ్ స్టేషన్‌లను కలిగి ఉంది. కంపెనీ బెంగళూరు, దిల్లీ వంటి నగరాల్లో 5500 కంటే ఎక్కువ కార్లను కలిగి ఉంది. ప్రారంభం నుంచి బ్లూ స్మార్ట్ క్యాబ్స్ 18,000 కంటే ఎక్కువ డ్రైవర్ భాగస్వాములను ఆన్‌బోర్డ్ చేసింది. 10 మిలియన్ల ఎలక్ట్రిక్ ట్రిప్పులను విజయవంతంగా అమలు చేసినందుకు 330 మిలియన్ల ఎలక్ట్రిక్ కిమీలను కవర్ చేసి దాదాపు 24,000 మెట్రిక్ టన్నుల కర్భన ఉద్గారాలను ఆదా చేసి పర్యావరణ హితానికి తోడ్పడుతుంది.

Show comments