Rivot NX100 scooter can go up to 300 kilometers on single charge: ఓలాను మించిన ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 300 కి.మీ!

ఓలాను మించిన ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 300 కి.మీ!

మార్కెట్ లోకి అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశపెట్టింది రివోట్ మోటార్స్ అనే కంపెనీ. ఓలాకు మించిన ఫీచర్లతో అందుబాటు ధరలోనే లభిస్తోంది. సింగిల్ చార్జ్ తో ఏకంగా 300 కి.మీలు ప్రయాణిచేలా రూపొందించారు.

మార్కెట్ లోకి అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశపెట్టింది రివోట్ మోటార్స్ అనే కంపెనీ. ఓలాకు మించిన ఫీచర్లతో అందుబాటు ధరలోనే లభిస్తోంది. సింగిల్ చార్జ్ తో ఏకంగా 300 కి.మీలు ప్రయాణిచేలా రూపొందించారు.

ప్రస్తుత రోజుల్లో వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి గల కారణం పెట్రోల్ రేట్లు పెరగడం, కాలుష్యాన్ని అరికట్టడం. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్ కంపెనీలకు అండగా నిలుస్తున్నాయి. వినియోగ దారుల అభిరుచుల దగ్గట్టు ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో వెహికిల్స్ ను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఓలా ఇంకా ఇతర కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో మరో కంపెనీ ఓ అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఓలాకు మించిన ఫీచర్లతో ఈ స్కూటర్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

ఎలక్ట్రిక్ వెహికిల్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసం రివోట్ మోటార్స్ అనే కంపెనీ అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. ఎన్ఎక్స్100 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ క్లాసిక్, ప్రో, మ్యాక్స్, స్పోర్ట్స్, ఆఫ్‌ల్యాండర్ అనే ఐదు వేరియంట్ల రూపంలో లభిస్తుంది. ఈ స్కూటర్ లో స్మార్ట్ డ్యాష్ కెమెరా,సేఫ్టీ, టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ స్కూటర్ ఏకంగా 100 నుంచి 300 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది.

క్లాసిక్ వేరియంట్ రేంజ్ 100 కి.మిగా, ప్రో వేరియంట్ రేంజ్ 200 కి.మిగా, మ్యాక్స్ వేరియంట్ రేంజ్ 300 కి.మిగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మ్యాక్స్ వేరియంట్ ధర రూ.1.59 లక్షలుగా ఉంది. ఇంకా ప్రో వేరియంట్ ధర రూ.1.29 లక్షలుగా ఉంది. క్లాసిక్ వేరియంట్ రేటు రూ.89 వేలు. కంపెనీ వెబ్‌సైట్‌లోకి రూ.499తో మీరు ఈ స్కూటర్‌ను ప్రిబుకింగ్ చేసుకోవచ్చు. కాగా వీటిల్లో రివర్స్ గేర్, ఫోన్ లాక్, ఫోన్ కనెక్టివిటిటీ, అలాయ్ వీల్స్, ఎల్ఈడీ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక రివోట్ మోటార్స్ రూపొందించిన ఎన్ఎక్స్100 ఓలా కంటే బెటర్ ఫీచర్స్ ను కలిగి ఉంది. ఓలా బైక్ లలో ఒక్కసారి చార్జింగ్ పెడితే 195 కి. మీలు మాత్రమే ప్రయాణించొచ్చు. కానీ ఎన్ఎక్స్100 ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జింగ్ తో 300 కి. మీ లు ప్రయాణించేలా రూపొందించారు. నగరాల్లో ఉండే వారికి ఈ ఎలక్ట్రిక్ బైక్ ఉపయోగకరంగా ఉండనుంది.

Show comments