బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. మళ్లీ పెరిగిన ధర

బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. మళ్లీ పెరిగిన ధర

క్రితం రెండు సెషన్లలో దిగి వచ్చిన బంగారం ధర నేడు మళ్లీ పెరిగింది. జూన్‌లో కనిష్ట స్థాయిలకు పడిపోయిన పసిడి రేటు.. ప్రస్తుతం రాకెట్‌ వేగంతో దూసుకుపోతుంది. జూలై మధ్య నుంచి బంగారం ధర భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం పుత్తడి ధర గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా దిగి వచ్చినా.. దేశీయంగా మాత్రం బంగారం ధర పైపైకి ఎగబాకుతూనే ఉంది. అన్‌సీజన్‌లో​ కూడా గోల్డ్‌ రేట్‌ ఇలా పెరుగుతుండటంతో.. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి నేడు మన దగ్గర బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయి.. తులం మీద గోల్డ్‌ రేటు ఎంత పెరిగింది అంటే..

నేడు అనగా బుధవారం దేశీయ మార్కెట్లలో బంగారం ధర మళ్లీ పెరిగింది. క్రితం రెండు సెషన్లలో దిగి వచ్చిన గోల్డ్‌ రేటు.. నేడు మళ్లీ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద ఒక్కరోజులో రూ.150 పెరిగి రూ. 55,400 మార్కుకు చేరింది. అలానే 24 క్యారెట్‌ బంగారం ధర విషయానికి వస్తే అది కూడా దిగి వచ్చింది. నేడు 24 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ.160 ఎగబాకి రూ. 60,440 వద్ద ట్రేడవుతోంది. నేడు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాముల మీద రూ.150 పెరిగి ప్రస్తుతం రూ.55,550 వద్ద ట్రేడవుతోంది. అలానే ఇక 24 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 140 పెరిగి రూ.60,570 మార్కు వద్ద ట్రేడవుతోంది.

భారీగా పెరిగిన వెండి ధర..

బంగారం బాటలోనే సిల్వర్‌ రేటు కూడా నేడు భారీగా పెరిగింది. ఒక్కరోజులో హైదరాబాద్‌ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ. 81 వేల మార్కుకు తాకింది. ఇక ఢిల్లీలో కూడా వెండి ధర కిలో మీద రూ.1000 ఎగబాకి రూ.78 వేల మార్కును చేరింది. ఢిల్లీ, హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇందుకు స్థానికంగా ఉండే పన్నులే ప్రధాన కారణం.

Show comments