Post Office Franchise: రిస్క్ లేని బిజినెస్ ఐడియా.. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ.. రూ.5 వేల పెట్టుబడితో నెలకు రూ.80000..

రిస్క్ లేని బిజినెస్ ఐడియా.. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ.. రూ.5 వేల పెట్టుబడితో నెలకు రూ.80000..

ఉన్న ఊరిలోనే ఉంటూ.. రిస్క్ లేకుండా.. తక్కువ పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించి... నెలకు వేలల్లో ఆదాయం పొందాలుకుంటున్నారా.. అలాంటి వారి కోసం బెస్ట్ ఐడియా పోస్టాఫీస్ ఫ్రాంచైజీ. ఈ బిజినెస్ వివరాలు..

ఉన్న ఊరిలోనే ఉంటూ.. రిస్క్ లేకుండా.. తక్కువ పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించి... నెలకు వేలల్లో ఆదాయం పొందాలుకుంటున్నారా.. అలాంటి వారి కోసం బెస్ట్ ఐడియా పోస్టాఫీస్ ఫ్రాంచైజీ. ఈ బిజినెస్ వివరాలు..

నేటి కాలంలో చాలా మంది యువత.. ఉన్నత చదువులు చదివినప్పటికి.. ఉద్యోగాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకరి కింద పని చేసే బదులు.. తమకు తామే ఆదాయం కల్పించుకోవడమే కాక.. మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చనే ఉద్దేశంతో.. బిజినెస్ వైపు ఆలోచన చేస్తున్నారు. అయితే వ్యాపారం చేయడం అంటే అంత సులువు కాదు. పెట్టుబడికి డబ్బులు అవసరమవుతాయి. భారీ పెట్టుబడి పెట్టి బిజినెస్ ప్రారంభించినా.. సక్సెస్ అవుతామా అంటే ఏమో చెప్పలేం. అందుకే వ్యాపారం చేయాలనుకునేవారు చాలా వరకు.. రిస్క్ లేని బిజినెస్ ల మీద ఆసక్తి చూపుతారు. అలాంటి వారి కోసమే ఇది. మీరు కూడా రిస్క్ లేకుండా.. తక్కువ పెట్టుబడితో.. భారీ ఆదాయం పొందాలనుకుంటే.. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ మీకు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. మరి ఈ వ్యాపారం చేయాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి.. పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది వంటి పూర్తి వివరాలు..

భారతీయ పౌరుల కోసం పోస్టాఫీసు పలు రకాల పథకాలను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. పొదుపు చేయాలనుకునే వారి కోసం కూడా రకరకాల స్కీమ్స్ తీసుకువచ్చింది. తపాలాశాఖ నిర్వహించే స్కీముల్లో పెట్టుబడి పెడితే.. గ్యారెంటీ రిటర్న్స్ పొందవచ్చు. ఈ కారణంతోనే చాలా మంది పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే, ఇలా పొదుపు పథకాలు మాత్రమే కాదు.. సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునే వారికి కూడా సరికొత్త అవకాశాలను కల్పిస్తోంది పోస్టల్ డిపార్ట్మెంట్. అదే ప్రోస్టాఫీసు ఫ్రాంచైజీ బిజినెస్ స్కీమ్. చాలా తక్కువ పెట్టుబడితో ఈ ఫ్రాంచైజీ ద్వారా నెలకు వేల రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు. అది కూడా ఉన్న ఊరిలోనే ఉండి సంపాదించుకోవచ్చు.

ఈ ఫ్రాంఛైజీలో కేవలం స్టాంప్స్‌, ఇతర స్టేషనరీ వస్తువులను అమ్మడానికి అవుతుంది. అలానే రిజిస్టర్డ్‌ ఆర్టికల్స్‌, స్పీడ్‌ పోస్ట్‌ ఆర్టికల్స్‌, మనీ ఆర్డర్‌ సర్వీస్‌లను బుక్‌ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బిల్లులు, టాక్స్‌, జరిమానాలు చెల్లింపు సర్వీసులు.. కొన్ని పథకాలను జనాలకు అందించాలి. అంతేకాక ఇన్సూరెన్స్ సేవలను కూడా మీరు అందించాల్సి వస్తుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు సుమారుగా లక్ష నుంచి 1.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రూ.5000 నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ కింద పే చెయ్యాలి కూడా. మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేసి ఫ్రాంచైజీ పొందొచ్చు. ఇలా అయితే 14 రోజుల్లోనే మీరు ఫ్రాంచైజీ పొందడానికి అర్హులా.. కాదా అనేది చెబుతారు.  దీని ద్వారా నెలకు గరిష్టంగా 80 వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు అంటున్నారు. మరి ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ఉండాల్సిన అర్హతలు, ఎంత ఆదాయం వస్తుంది అంటే.

అర్హతలు..

  • పోస్టాఫీసు ఫ్రాంచైజీ ప్రారంభించాలనుకునే వారి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • భారతీయ పౌరుడు ఎవరైనా ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు.
  • కనీసం 8వ తరగతి అయినా పాస్ అయిన వాళ్లే ఇందుకు అర్హులు.
  • పోస్టల్ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులు ఈ ఫ్రాంచైజీలను తెరవడానికి వీలు లేదు.

ఆదాయం ఎలా…

  • పోస్టాఫీసుకు చెందిన పలు సర్వీసులను అందిస్తూ.. వాటి మీద వచ్చే కమీషన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.
  • రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్‌ మీద రూ.3 కమీషన్ తీసుకోవచ్చు.
  • స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్ పై రూ.5 తీసుకోవచ్చు.
  • అలానే రూ.10-రూ. 200 మధ్య ఉండే మనీయార్డర్లకు రూ. 3.50 కమీషన్, రూ.200 ఆపైన ఉండే వాటికి రూ.5 కమీషన్ తీసుకోవచ్చు.
  • నెలవారీ టార్గెట్ కింద 1000 రిజిస్టర్డ్, స్పీడ్ పోస్ట్ బుకింగ్స్ చేసినట్లయితే అదనంగా 20 శాతం కమీషన్ లభిస్తుంది.
  • పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయించడం ద్వారా 5 శాతం కమీషన్ పొందవచ్చు.
  • రిజిస్టర్డ్ పార్సిల్ నుంచి నెలవారీ బిజినెస్‌లకు స్పీడ్ పోస్ట్ పార్సిల్స్‌కి కమీషన్లు భిన్నంగా ఉంటాయి.
Show comments