భారత్ కి చంద్రయాన్-3 అవసరమా అన్న యాంకర్‌కు.. ఆనంద్‌ మహీంద్రా స్ట్రాంగ్‌ రిప్లై!

చంద్రయాన్‌ 3 విజయంతో.. అంతరిక్షయానంలో భారతదేశం.. సరికొత్త రికార్డు సృష‍్టించింది. మిగతా దేశాలకు భిన్నంగా ఇండియా.. జాబిల్లి దక్షిణ ధ్రువం మీద విజయవంతంగా కాలు మోపింది విక్రమ్‌. ఇస్రో సాధించిన విజయంపై యావత్‌ దేశమే కాక.. ప్రపంచం దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇండియా మూన్‌ మిషన్‌కు పోటీగా రష్యా ప్రంపించిన.. లూనా-25 కుప్ప కూలిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా హౌజ్‌లు.. చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌ని లైవ్‌ టెలికాస్ట్‌ చేశాయి. ప్రతి ఒక్కరు భారత్‌ సాధించిన విజయంపై ప్రశంసలు తెలిపితే.. ఒక్క బీబీసీ మాత్రమే ఇందుకు భిన్నంగా స్పందించింది.

తాజాగా చంద్రయాన్‌ 3 ప్రయోగం సందర్భంగా బీబీసీ యాంకర్‌ ఒకరు తన అహంకారాన్ని చాటుకున్నాడు. టాయిలెట్లు లేని భారత్‌కి చంద్రయాన్‌ అవసరమా అని ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

ఇక వీడియోలో బీబీసీ యాంకర్‌.. మాట్లాడుతూ.. ‘‘సరైన మౌళిక సదుపాయాలు లేవు.. దేశంలో ఏకంగా 700 మందికి కనీసం టాయిలెట్లు కూడా లేక.. కడు పేదరికంలో మగ్గుతున్న భారత్‌.. అంతరిక్ష కార్యక్రమం కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం అవసరమా అని కొందరు జనాలు చర్చించుకుంటున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏంటని’’.. ఓ వ్యక్తిని ప్రశ్నించాడు బీబీసీ యాంకర్‌. పాత వీడియో కాస్త మరోసారి వైరలవ్వడంతో.. సదరు యాంకర్‌ మీద ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. ఇక తాజాగా దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. బీబీసీ యాంకర్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ఆనంద్‌ మహీంద్ర చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. ‘‘అవునా అలా అనుకుంటున్నారా.. ఇంతకు వాస్తవం ఏంటంటే.. భారతదేశం నేటికి కూడా పేదరికంలో మగ్గడానికి.. కారణం వందల ఏళ్ల పాటు సాగిన మీ బిట్రీష్‌ దోపిడి పాలన. వందల ఏళ్ల పాటు.. మా దేశ సంపదను మీరు తరలించుకు వెళ్లారు. మీరు కేవలం కోహీనూర్‌ వజ్రాన్ని మాత్రమే కొల్లగొట్టలేదు.. మా ధైర్యాన్ని, నమ్మకాన్ని, మా శక్తి సామర్థ్యాలను కూడా నశింపజేశారు. మేం న్యూనతాభావంతో బతికేలా చేశారు. అయినా అంతరిక్షం, టాయిలెట్స్‌ మీద ఖర్చు పెట్టుబడి పెట్టడం నేరం కాదు’’ అన్నారు.

‘‘సార్‌, మాకోసం జాబిల్లి మీదకు మేం ఏవైతే పంపామో.. అవి మేం కోల్పోయిన మా గౌరవం, ఆత్మస్థైర్యాలను తిరిగి పొందడంలో సాయం చేస్తాయి. సైన్స్‌ వల్ల కలిగే అభివృద్ధిపై నమ్మకాన్ని కల్పిస్తాయి. పేదరికం నుంచి బయటపడాలనే ఆకాంక్షను రగిలిస్తాయి. అది లేకపోవడమే.. అసలైన పేదరికం’’ అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఆనంద్‌ మహీంద్రా. నెటిజనులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

Show comments