P Krishna
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల నుంచి ఎండలు దంచికొట్టాయి. అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అనూహ్యంగా పదిరోజుల క్రితం వాతావరణంలో మార్పులు రావడం.. వర్షాలు పడటం జరిగింది.
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల నుంచి ఎండలు దంచికొట్టాయి. అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అనూహ్యంగా పదిరోజుల క్రితం వాతావరణంలో మార్పులు రావడం.. వర్షాలు పడటం జరిగింది.
P Krishna
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు వర్షాలో వాతావరణం చల్లగా ఉండగా.. ఒక్కసారిగా ఎండలు, వేడి గాలుల తీవ్ర పెరిగింది. వాస్తవానికి ఏప్రిల్, మే నెలలో సూర్యడు ప్రఛండ రూపం దాల్చుతాడు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం చూస్తుంటాం. కానీ గత పదిరోజుల నుంచి ఇరు రాష్ట్రాల్లో వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ‘రెమల్’ తుఫాన్ ఏర్పడి వర్షాలు దంచికొట్టాయి. దీంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. ‘రెమల్’ తుఫాన్ తీరం దాటిపోయింది.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పరిస్థితిపై వాతావరణ శాక అలర్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు వర్షాలు పడి చల్లగా ఉన్న వాతావరణం ఇప్పుడు ఒక్కసారిగా మారింది. సోమవారం నుంచి ఎండలు, వేడి గాలుల తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతులు ఏకంగా 42 డిగ్రీలు దాటింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది.మరోవైపు ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అవుతుందని చెబుతున్నారు. ఏపీలో రానున్న మూడు రోజులు ఎండ ప్రభావం చూపుతుందని విపత్తు సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నేడు 149 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 160 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తిరుపతి జిల్లా సత్య వేడు లో 42 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో మనబోలులో 41.5 డిగ్రీలు, బాపట్ల, వేమూరు, కృష్ణ, పెడన లో 40.9 ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలిపారు. ఏదైనా అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని, గర్బిణులు, బాలింతలు,వృద్దులు, చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. కొద్దిసేపు ఎండలు.. అంతలోనే ఆకాశంలో మబ్బులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం (మే28) పలు జిల్లాల్లో ఈదురు గాలులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పెద్ద అంబర్ పేట్, వనస్థలిపురం, హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, నాచారం లో మోస్తరు వర్షం కురిసింది. కీసర, ఘట్ కేసరి మండాలల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది. నేడు తెలంగాణలో హైదరాబాద, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, మహబూబ్ నగర్, సూర్యపేట, సంగారెడ్డి, నల్లగొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాఖ తెలిపింది. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.