కాలంతో పాటు వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తరచూ అనేక వింత ఘటనలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జరిగే వింతలు, విచిత్రాలు మనకు ఆశ్చర్యానికి కలిగిస్తాయి. సాధారణంగా ఎక్కడైన భూమిలో నుంచి నీరు బయటకు వస్తాయి. కానీ చెట్టు నుంచి నీరు ఉబికి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. చెట్టును నరుకుతుండగా నీరు ఉబికి వచ్చింది. ఈ వింత ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం సమీపంలో నల్లమల్ల అటవీ ప్రాంతం ఉంది. కొందరు వ్యక్తులు ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్లి చెట్లు నరుకుతుండే వారు. అలానే ఇటీవల కూడా కొందరు వ్యక్తులు చెట్లు నరికేందుకు అడవికి వెళ్లారు. అక్కడ చెట్లు నరుకుతున్న క్రమంలో ఓ చెట్టు నుంచి నీరు చుక్కలు బయటకు వచ్చాయి. దీంతో వారు మరికాస్తా చెట్టు కాడను నరకగా.. అందులో నుంచి మంచినీళ్లు ఉబికి వచ్చాయి. దీంతో ఆ చెట్టును చూడడానికి స్థానిక ప్రజలు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు.
అంతేకాక ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను కూడా తాగుతున్నారు. సాధారణం చెట్ల నుండి పాలు వస్తుంటాయి. కొన్ని చోట్ల బెరడుల నుంచి పాలు రావడం సర్వసాధారణం. వాతావరణంలో మార్పులు, చెట్టు లక్షణాల కారణంగా ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న వింతలు మాత్రం శాస్త్రవేత్తలను సైతం ఆలోచనలో పడేస్తున్నాయి. మరి.. ఈ వింత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భర్త కష్టం చూడలేక.. కాడెద్దులుగా మారిన భార్యలు..