AP యువకుడికి అద్భుత అవకాశం..ఏకంగా రూ.కోటి స్కాలర్ షిప్ తో స్టాన్ ఫోర్డ్‌లో సీటు!

Stanford University: ప్రతిభకు సాన పెట్టి..ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. అలానే తమ శ్రమ, కృషితో అద్భతమైన అవకాశాలు పొందుతుంటారు. అలానే ఏపీలోని విశాఖ పట్నంకి చెందిన ఓ యువకుడు అద్భుతమైన ఘనత ను సాధించారు.

Stanford University: ప్రతిభకు సాన పెట్టి..ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. అలానే తమ శ్రమ, కృషితో అద్భతమైన అవకాశాలు పొందుతుంటారు. అలానే ఏపీలోని విశాఖ పట్నంకి చెందిన ఓ యువకుడు అద్భుతమైన ఘనత ను సాధించారు.

ప్రతి మనిషికి ప్రతిభ అనే ఉంటుంది. ఈ ప్రతిభకు సంకల్పం, కృషి తోడైతే..విజయం మన పాదాల ముందుకు వస్తుంది. అలా తమ ప్రతిభకు సాన పెట్టి..ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. అలానే తమ శ్రమ, కృషితో అద్భతమైన అవకాశాలు పొందుతుంటారు. తాజాగా అలాంటి వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ యువకుడు చేరాడు. వైజాగ్ కి చెందిన ఆ యువకుడికి  అరుదైన అవకాశం దొరికింది. ఆ యువకుడు ఎవరు, అతడు సాధించిన ఆ ఘనత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఏపీలోని విశాఖపట్నంకు చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరణ్  అరుదైన ఘనతను సాధించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్టు యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో రూ. కోటి స్కాలర్ షిప్ తో సీటు లభించింది.  దీనితో పాటు యూఎస్ లోనే ఉన్న మరో ఫేమస్ యూనివర్సిటీ ఐవీవై లీగ్‌ యూనివర్సిటీలో కూడా సీటు లభించింది. అయితే తాను మాత్రం స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీలో చేరనున్నట్లు శ్రీరామ్‌ తెలిపారు. దేశంలో అతికొద్ది మందికి మాత్రమే స్కాలర్‌షిప్‌తో కూడిన సీటు లభిస్తుందనే విషయం మనకు తెలిసిందే. అలాంటి కొద్ది మందిలో ఏపీ రాష్ట్రం నుంచి తనకు ఈ అవకాశం లభించిందని శ్రీరామ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని స్టాన్ ఫోర్డు యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ చదువుకోవాలని ఎంతో మంది యువత డ్రీమ్ గా పెట్టుకుంటారు. స్టాన్ ఫోర్డు యూనివర్సిటీలో సీటు పొందేందుకు కొన్ని లక్షల మంది యువత పోటీ పడుతుంటారు. కానీ అతి తక్కువ మందికి మాత్రమే అందులో సీటు లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే..స్టాన్ ఫోర్డులో సీటు లభించడం అంటే.. ఆస్కార్ అవార్డు పొందినట్లుగా ఎంతో మంది యువత ఫీల్ అవుతుంటారు. తాజాగా అలా స్టాన్ ఫోర్డులో రూ. కోటి స్కాలర్ షిప్ తో సీటు పొంది.. అద్భుతమైన అవకాశాన్ని  శ్రీరామ్ వరుణ్ పొందారు.

విశాఖ పట్నంకు చెందిన శ్రీరామ్ వరుణ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన తండ్రి డాక్టర్ వి.రాజ్ కమల్ విజయవాడ  సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగ ప్రొఫెసరుగా పని చేస్తున్నారు. అలానే శ్రీరామ్ తల్లి  సౌదామిని కూడా వైద్యురాలే. ఆమె విశాఖలోనే గైనకాలజిస్టుగా సేవలందిస్తున్నారు. ఇక శ్రీరామ్ వరణ్ చిన్నతనం నుంచి చదువులో ముందుండే వారు. ఎస్ఎస్సీలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అలానే శ్రీరామ్ ఇంటర్మీడియట్ లో983 మార్కులతో టాప్ రల్లో ఒకరయ్యారు. ఆ తరువాత జరిగిన ఐఐటీ జేఈఈ అడ్వాన్సుడ్‌లో జాతీయ స్థాయిలో 178వ ర్యాంకు సాధించారు.

ఐఐటీ జేఈఈ లో మంచి ర్యాంకు రావడంతో కాన్పూర్‌ ఐఐటీలో సీఎస్‌ఈ ని చదివారు.  విధ్యాభ్యాసం అనంతరం దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కంపెనీ సామ్‌సంగ్‌ సంస్థలో పరిశోధన ఇంజినీరుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీరామ్ రూ.1.25కోట్లు వార్షిక వేతనం పొందుతున్నారు. తాజాగా ఎంబీఏ సీటును స్కాలర్‌షిప్‌తో దక్కించుకున్నారు. మరి.. శ్రీరామ్ వరణ్ అందుకున్న ఈ అద్భుత అవకాశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments