తిరుమల ఎక్స్ ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. రైలులో పేలుడు పదార్థాలు

ఒడిశా రైలు ప్రమాద ఘటన ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికి తెలుసు. ఈ ఘటనలో సుమారు 300 మంది మరణించారు. మొన్నటికి మొన్న విజయనగరంలోని కొత్తవలసలో రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో 10 మంది చనిపోయారు. తాజాగా..

ఒడిశా రైలు ప్రమాద ఘటన ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికి తెలుసు. ఈ ఘటనలో సుమారు 300 మంది మరణించారు. మొన్నటికి మొన్న విజయనగరంలోని కొత్తవలసలో రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో 10 మంది చనిపోయారు. తాజాగా..

వరుస రైలు ప్రమాద ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ ఏడాది ఒడిశాలోని కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం చరిత్రలో నిలిచిపోయే విషాద సంఘటనగా మారింది. సుమారు 300 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా విజయనగరంలో రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో 10 మంది మరణించారు. ఈ యాక్సిడెంట్లతో రైలు ఎక్కాలంటే భయపడుతున్నారు ప్రజలు. అంతేనా భోగీల్లో మంటలు, రైలు పట్టాలు తప్పడం వంటి సంఘటనలు గురించి చదివి, విని మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పుడు మరోసారి ఏపీలో ఓ రైలులో మంటలు చెలరేగాయాయి. అప్రమత్తమైన కొందరు చైన్ లాగడంతో పెను ప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళితే.. విశాఖ-తిరుపతికి వెళ్లే తిరుమల ఎక్స్ ప్రెస్‌కు భారీ ముప్పు తప్పింది. సోమవారం విశాఖ పట్నం నుండి తిరుపతికి బయలు దేరింది తిరుమల ఎక్స్ ప్రెస్.  సాయంత్రం నాలుగు గంటల సమయంలో రైలు తుని స్టేషన్‌లో ఆగింది. అనంతరం బయలు దేరుతున్న సమయంలో ఎస్ 3 బోగీలోని టాయిలెట్ దగ్గర ఓ సంచి నుండి పొగలు రావడం ప్రారంభించాయి. పొగను చూసి భయపడ్డారు ప్రయాణీకులు. వెంటనే అప్రమత్తమైన కొందరు.. చైన్ లాగి రైలును నిలిపివేసి.. బయటకు పరుగులు తీశారు. అయితే ఎక్కడ నుండి పొగ వస్తుందని చూడగా.. ఓ సంచి నుండని గుర్తించారు. సంచిని తెరిచి చూడగా బాణా సంచా కనిపించింది.

బాణా సంచా నుండి పొగలు వస్తున్నాయని నిర్దారించుకున్న  ఓ వ్యక్తి కాలితో  సంచిని తొక్కి బయటకు విసిరేశారు. పొగను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది, ఆర్పీఎఫ్ పోలీసులు బోగీ దగ్గరకు చేరుకున్నారు. మొత్తం  రైలును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. ప్రమాదం తప్పిందని గ్రహించి.. రైలు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పడేసిన బ్యాగును పరిశీలించగా.. బాణా సంచా సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు. వాటిని రైలులో ఎక్కడికి తీసుకెళుతున్నారో.. ఎవ్వరు తీసుకెళుతున్నారో తెలియ రాలేదు. ఇటువంటి ప్రమాదాలు గురించి చదివుతుంటే గుండె ఝళ్లుమంటోంది. ఇక అనుభవిస్తున్న పరిస్థితి దారుణం. వరుస రైలు ప్రమాదాలు జరుగుతుండటానికి కారణాలు ఏమయ్యి ఉంటాయని భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments