విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన AP సర్కార్!

Sankranti Holidays: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంక్రాంతి పండగ సెలవులపై క్లారీటి వచ్చింది. తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన సెలవుల ప్రకటనతో విద్యార్థులకుఊర్లకు పయనం అవుతున్నారు.

Sankranti Holidays: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంక్రాంతి పండగ సెలవులపై క్లారీటి వచ్చింది. తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన సెలవుల ప్రకటనతో విద్యార్థులకుఊర్లకు పయనం అవుతున్నారు.

దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఎంతో సంబరంగా జరుపుకుంటారు. తెలుగు వారికి ఎన్ని పండగలు ఉన్నా.. సంక్రాంతి ఎంతో ప్రత్యేకమైనది. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు తమ స్వగ్రామాలకు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేవి కోడి, ఎడ్ల పందాలు. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు క్రీడ కూడా ఆడుతుంటారు. చిన్నా.. పెద్ద తేడా లేకండా పతంగులు ఎగురవేస్తుంటారు. సంక్రాంతికి కొత్త అల్లుళ్ళ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నోరూరించే రక రకాల వంటకాలు, గ్రామాల్లో రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు.. ఆటా, పాట ఎంతో సందడిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెలవుల తేదీలను ప్రకటించింది.

సంక్రాంతి పండుగ అంటే ఏపీలో కనీసం వారం రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లి పండగను ఘనంగా జరుపుకుంటారు. పులిహోహ, బొబ్బట్లు, అరిసెలు, పరమాన్నం వంటి సంప్రదాయ వంటకాలు వండుతారు.. బంధువులతో కలిసి ఒకేచోట పండుగ నిర్వహించుకుంటారు. ఇక పండగ సెలవుల కోసం విద్యార్థులు ఎంతాగానో ఎదురు చూస్తుంటారు. ఏపీలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులపై కొనసాగుతున్న సందిగ్ధతపై క్లారిటీ వచ్చింది. జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

అంతేకాక ఈ నేపథ్యంలో జిల్లా విద్యా శాఖాధికారులకు అన్ని యాజమాన్యలకు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. సెలవుల సమయంలో పాఠశాలలు కానీ, ప్రత్యేక తరగతలు కానీ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సెలవుల తర్వాత జనవరి 19న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాలో విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టారు. అదే విధంగా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సందర్బంగా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఈ బస్సులను ఏర్పాటు చేసింది.

Show comments