Pawan Kalyan: ఫ్యాన్స్ పై నమ్మకం లేకనే.. బాబు కోసం పవన్ ఆరాటమా?

ఫ్యాన్స్ పై నమ్మకం లేకనే.. బాబు కోసం పవన్ ఆరాటమా?

ఫ్యాన్స్ పై నమ్మకం లేకనే..  బాబు కోసం పవన్ ఆరాటమా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. గురువారం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. పవన్ చేసిన ఈ కామెంట్స్ ఆయన అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఫ్యాన్స్ పై నమ్మకం లేకనే  టీడీపీతో కలిసి వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

2019 ఎన్నికలో జనసేన అధినేత అభిమానలను నమ్ముకుని  గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేశారు. అయితే పోటీ చేసిన రెండు స్థానాల్లో  పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు. అంతేకాక ఆ ఎన్నికల్లో జనసేన గెల్చుకుంది ఒక్కే ఒక్క సీటు. ఆయన ఎంతో ఆశలు పెట్టుకున్న ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజలు వైసీపీకే పట్టం కట్టారు. దీంతో ఆయనకు అప్పటి నుంచి ఉభయగోదావరి జిల్లాల ప్రజలపై, ముఖ్యంగా ఆయన అభిమానులపై నమ్మకం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే తరచూ పవన్ ప్రసంగంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు. మీరు సీఎం.. సీఎం అంటే సరిపోదని.. ఓటు వేసి, మీతోటి వారితో ఓటు వేయిస్తేనే సీఎం అవుతానంటూ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.

అంతేకాక పలు సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే మాట తప్ప.. తాను సింగిల్ గా పోటీ చేస్తానని ధైర్యంగా చెప్పలేదు. అయితే అందుకు కారణం ఫ్యాన్స్ పై నమ్మకం లేకనే అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందంటూ పవన్ కల్యాణ్ పరోక్షంగా అనేక సార్లు కామెంట్స్ చేశాడు. తాజాగా గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు మీడియాతో మాట్లాడుతూ.. అధికారికంగా చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ కామెంట్స్ తో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాని పవన్ అన్నారు. అంతేకాక రాబోయే ఎన్నికల్లో టీడీపీతో  కలిసి పోటీ  చేస్తామని తేల్చి చెప్పారు.

అయితే తమ నేత సీఎం అవుతాడని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఈ పొత్తుతో వాటిపై నీళ్లు చల్లాడు. అయితే అసలు అభిమానులపై నమ్మకం లేకనే పవన్.. బాబు కోసం ఆరాట పడుతున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఫ్యాన్స్ నే పవన్ నమ్మడం లేదని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి కోసం ఎందుకింత పాకులాట అంటూ పవన్ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ పై నమ్మకం లేకనే బాబుతో పొత్తుకోసం పవన్ ఆరాటపడుతున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments