Arjun Suravaram
ప్రస్తుతం ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వానలు పండుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు ఓ కీలక అలెర్ట్.
ప్రస్తుతం ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వానలు పండుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు ఓ కీలక అలెర్ట్.
Arjun Suravaram
గతకొన్ని రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దండికొట్టాయి. మే చివరి వారం వరకు కూడా ఎండలు ఓ రేంజ్ లో విజృంభించాయి. అయితే కొద్ది రోజుల నుంచి అక్కడక్కడ తేలికపాటి వానలు కురిశాయి. ఇది ఇలా ఉంటే ఏపీలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి కాస్తా ఆలస్యంగా ప్రవేశించాయి. రేపు, ఎల్లుండి ఏపీలో వానాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. అలానే కొన్ని జిల్లాలో ఉరుములు,మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వానలు పండుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. అలానే కొన్ని జిల్లాలో వానలు పడుతుంటే.. మరికొన్ని చోట్ల ఎండ, ఉక్కపోత బాగా కనిపిస్తోంది. సోమవారం కోస్తాంధ్రాంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలు, అలానే రాయలసీమలోని అన్నమయ్య జిల్లా, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అదే విధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో తెలికపాటి వానాలు కురుసే ఛాన్స్ ఉంది. అలానే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవాశం ఉందని చెబుతున్నారు. ఇక రాయలసీ ప్రాంతాలైన చిత్తూరు, తిరుపతి, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగం తగ్గిదని, దక్షిణ భారతదేశం మొత్తం విస్తరించాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. అయినా వర్షాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ వేసవికాలం మాదిరిగా ఎండలు, వడగాడ్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే రెండు మూడు రోజుల్లో రుతుపవనాల్లో కదలిక వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా రేపు, ఎల్లుండి ఏపీలో వానలు పడే అవకాశం ఉంది.