IMD Forecast Rains In AP: AP ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వానలు

Rains Alert: AP ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వానలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆ వివరాలు..

ఓవైపు దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంటే.. కొన్ని రాష్ట్రల్లో మాత్రం విచిత్రకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. శీతాకాలంలో ఎడతెరపి లేని వానలు కురస్తూ.. జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల స్కూళ్లకు 5 రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వర్షాలు కురుస్తూ.. భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ వాతావరణ శాఖ అధికారులు రెయిల్ అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, యానంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. అంతేకాక అల్ప పీడనం ప్రభావం వల్ల ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈక్రమంలో నేడు అనగా బుధవారం నాడు బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావణ శాఖ అధికారులు అంచనా వేశారు.

అంతేకాక దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని.. అలాగే రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఏపీ భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత పెరిగింది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువతున్నాయి. ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాలు చలికి వణికిపోతున్నాయి. దట్టమైన పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

లంబసింగి, చింతపల్, మినుములూరు, పాడేరు వంటి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాక ఈ ప్రాంతాల్లో సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు . మరోవైపు పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండలో పర్యాటకులు సందడి చేస్తున్నారు. పొగమంచు చాటున సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Show comments