iDreamPost

తమిళనాడులో చరిత్రలో అతిపెద్ద డ్రగ్స్ బస్ట్! ఖైదీ మూవీ తరహాలో!

Drugs Seized In Madurai Railway Station: తమిళనాడులో మాదకద్రవ్యాలపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మరోసారి డ్రగ్స్ ను సీజ్ చేశారు.

Drugs Seized In Madurai Railway Station: తమిళనాడులో మాదకద్రవ్యాలపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మరోసారి డ్రగ్స్ ను సీజ్ చేశారు.

తమిళనాడులో చరిత్రలో అతిపెద్ద డ్రగ్స్ బస్ట్! ఖైదీ మూవీ తరహాలో!

ప్రస్తుతం ఎక్కడ చూసినా.. మాదక ద్రవ్యాలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. నగరాల్లో పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. ప్రభుత్వాలు, అధికారులు ఎంత నిఘా పెట్టినా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ రవాణా జరుగుతూనే ఉంది. తాజాగా ఏకంగా రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ తరహాలో డ్రగ్స్ పట్టుబడటం చూసి అందరూ ఇప్పుడు ఖైదీ సినిమాని గుర్తు చేసుకుంటున్నారు. మరి.. ఆ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఎలా ఆ మాదకద్రవ్యాలను పట్టుకున్నారంటే?

ఇటీవలి కాలంలో డ్రగ్స్, గంజాయి, యాష్ ఆయిల్ అంటూ తమిళనాడు పేరు మారుమోగుతోంది. ఇటీవలే 2000 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ రాకెట్ లో తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. మధురైలో ఇటీవలే 850 గ్రాముల మెథాంఫిటమిన్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడటం దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. అది కూడా రైలులో ఈ డ్రగ్స్ ని రవాణా చేస్తున్నారు. డైరెక్టోరేట్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులకు అందిన సమాచారంతో రైల్వే పోలీసులను సమన్వయం చేసుకుంటూ ఈ భారీ డ్రగ్స్ రవాణాను అడ్డుకున్నారు.

ఒక వ్యక్తి చెన్నై నుంచి సెంగొట్టాయ్- పోతిగాయ్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నాడు. అతని వద్ద మాదకద్రవ్యాలు ఉన్నట్లు డీఆర్ఐ అధికారులకు పక్కా సమాచారం అందింది. అధికారులు అతనిపై నిఘా పెట్టడమే కాకుండా.. రైల్వే పోలీసులతో కలిసి అతడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం 30 కిలోల విలువైన మెథాంఫిటమిన్ ట్యాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.90 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇది కేవలం ఒక డ్రగ్స్ రవాణాని అడ్డుకున్న ఆపరేషన్ మాత్రమే కాదు అంటూ అధికారులు చెబుతున్నారు. తమిళనాడులో మాదకద్రవ్యాలను చలామణి చేస్తున్న ముఠాలకు ఒక గట్టి హెచ్చరిక అంటున్నారు.

డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాలు చేసే పనులకు ఎంతో మంది అమాయకులు, విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి అంటూ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వార్త విన్న తర్వాత సోషల్ మీడియాలో చాలామంది తమిళనాడులో ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. ఖైదీ సినిమా గుర్తొస్తోంది అంటున్నారు. ఆ మూవీలో కూడా విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకం, రవాణా అంటూ చూపించారు. అందులో హీరో కార్తి తెలియకుండానే ఒక పెద్ద డ్రగ్స్ రాకెట్ ని బర్స్ట్ చేస్తాడు. ఇప్పుడు పక్కా సమాచారంతో రైల్వే పోలీసులు, డీఆర్ఐ అధికారులు రూ.90 కోట్ల విలువైన మెథాంఫిటమిన్ ను పట్టుకున్నారు అంటూ ప్రసంశిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి