Arjun Suravaram
ఎంతో మంది అమ్మాయిలు ఉద్యోగాలు, చదువుల కోసం కుటుంబాన్ని వదలి నగరాలకు వెళ్తుంటారు. అలా వెళ్లిన ఓ యువతి తాను ఉంటున్న పీజీ హాస్టల్ దారుణ హత్యకు గురైంది. ఇక పోలీసులు విచారణ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎంతో మంది అమ్మాయిలు ఉద్యోగాలు, చదువుల కోసం కుటుంబాన్ని వదలి నగరాలకు వెళ్తుంటారు. అలా వెళ్లిన ఓ యువతి తాను ఉంటున్న పీజీ హాస్టల్ దారుణ హత్యకు గురైంది. ఇక పోలీసులు విచారణ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Arjun Suravaram
నేటి ఆధునిక యుగంలో ఆడవాళ్లు ఎంతో అభివృద్ధి చెందారు. మగవాళ్లతో పోటీగా వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమాజంలో కూడా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళపై దాడులు, వివిధ రకాల వేధింపులు జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే పలు చోట్ల ఆడవారిని హత్య చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అలానే ఉద్యోగం నిమిత్తం కుటుంబాన్ని వదలి హాస్టల్ లో ఉంటున్న ఓ యువతి దారుణ హత్యకు గురైంది. చివరు ఓ చిన్న క్లూతో నిందితుడు చిక్కాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ రాష్ట్రానికి చెందిన కృతి కుమారి అనే 24 ఏళ్ల యువతి కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు ఉద్యోగ నిమిత్తం వచ్చింది. నగరంలోని కోరమంగళలోని లేడీ స్ పీజీ హాస్టల్ ఉంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి కుమారి దారుణ హత్యకు గురైంది. ఆమె హత్య ఘటనపై పీజీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే వారికి సంచలన నిజం తెలిసింది. ఆ యువతిని ఆమె లవర్ హత్య చేసినట్లు తెలిసింది. ఈ మర్డర్ జరగడానికి ముందు వారిద్దరు పీజీలోకి వచ్చారు.
మంగళవారం 10.30 గంటలకు కృతి కుమారి ఆ యువకుడిని తీసుకొచ్చినట్లు సమాచారం. పీజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కృతి తన ప్రియుడితో కలిసి డిన్నర్ చేసింది. కృతి భోజనం ముగించి లవర్ ను కూడా పీజీలోకి తీసుకొచ్చింది. ఆ దృశ్యం సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఇక కృతి గదిలోకి రాగానే వారిద్దరి మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలా ఉంటే..హత్య జరగడానికి రెండు రోజుల క్రితమే కృతి పీజీలో చేరింది. ఆమె పీజీలో చేరే సమయంలో ఈ యువకుడే కృతి సామాన్లు తీసుకొచ్చాడు.
దీంతో పీజీ సెక్యూరిటీ యువకుడిని లోపలికి రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో కృతి తన సోదరుడని, త్వరలో పంపిస్తానని చెప్పి పీజీ సెక్యూరిటీ లోపలికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలా చెప్పడంతో తరువాత రోజు కూడా ఆ యువకుడిని లోపలికి తీసుకెళ్లింది. ఈహత్యపై కోరమంగళ పోలీసులు కేసు నమోదు చేసి.. యువతి కృతి కుమారి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఇలా తరచూ మహిళపై దాడులు చోటుచేసుకుంటున్నాయి. మరి.. ఇలాంటి ఘటన నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.