Big Relief For Pushpa 2 Team: పుష్ప 2 చిత్ర బృందానికి ఊరట

Pushpa 2: పుష్ప 2 చిత్ర బృందానికి ఊరట

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇది శుభవార్త అనే చెప్పాలి. పుష్ప 2 సినిమాకి సంబంధించి భారీ ఊరటను కలిగించే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇది శుభవార్త అనే చెప్పాలి. పుష్ప 2 సినిమాకి సంబంధించి భారీ ఊరటను కలిగించే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఎట్టకేలకు పుష్ప 2 చిత్ర బృందానికి కాస్త ఊరట లభించింది. నటుడు జగదీష్ ప్రతాప్ బండారి చిత్రీకరణకు తిరిగి రావడంతో “పుష్ప: ది రూల్” సెట్స్‌లో ఉపశమనం తాలూకు ఛాయలు అల్లుకున్నాయి. ఇటీవల జగదీష్‌కు బెయిల్ మంజూరైంది. డిసెంబర్ 2023లో ఒక అమ్మాయి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గానూ నటుడు జగదీష్ ప్రతాప్ బండారిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఒక రకంగా ఇది చిత్ర బృందానికి ఆనందాన్ని ఇచ్చే విషయమే. ప్రస్తుతానికి జగదీష్ ఆ కేసు నుండి పూర్తిగా బయట పడనప్పటికీ… సినిమాలో నటించడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని వినికిడి. ప్రస్తుతం, హైదరాబాదులో చిత్రీకరిస్తున్న గంగమ్మ జాతరలో చిత్ర యూనిట్ పాలు పంచుకుంటుండగా, త్వరలో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లనుంది.

పుష్ప 2 యొక్క నిర్మాణ బృందం జగదీష్‌కు న్యాయపరమైన సహాయాన్ని అందించిందట. ఎందుకంటే సినిమాలో తనది కీలక పాత్ర. ప్రస్తుతానికి, ఇతర పార్టీలు అతని బెయిల్‌కు వ్యతిరేకంగా కోర్టులో పోరాడకపోతే ఈ యువ నటుడి హాజరుతో షూటింగ్ సజావుగా సాగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్ప 2 సినిమా షూటింగ్ కొనసాగుతుందని, నిర్మాతలు ప్రకటించినట్లుగా ఆగస్టు 15న విడుదల అవుతుందని ఆశిద్దాం.

Show comments