OTT Releases- Best Science Fiction Web Series: OTTలోకి బాలకృష్ణ ఆదిత్య 369 తరహా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTTలోకి బాలకృష్ణ ఆదిత్య 369 తరహా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Releases- Science Fiction Series: ఓటీటీలోకి ఎన్ని సినిమాలు వచ్చినా.. ఎన్ని సిరీస్లు వచ్చినా సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రాలకు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు తెలుగులో వచ్చిన ఆదిత్య 369 మూవీలాంటి వెబ్ సిరీస్ వస్తోంది.

OTT Releases- Science Fiction Series: ఓటీటీలోకి ఎన్ని సినిమాలు వచ్చినా.. ఎన్ని సిరీస్లు వచ్చినా సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రాలకు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు తెలుగులో వచ్చిన ఆదిత్య 369 మూవీలాంటి వెబ్ సిరీస్ వస్తోంది.

ఎన్ని జానర్స్ వచ్చినా కూడా సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రాలకు పాన్ వరల్డ్ స్థాయిలో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే భాషతో ససంబంధం లేకుండా హాలీవుడ్ చిత్రాలు ఇండియాలో కూడా విపరీతంగా కలెక్ట్ చేస్తాయి. తెలుగులో కూడా అలాంటి సినిమాలు కొన్ని వచ్చాయి. వాటిలో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 మూవీ కూడా ఒకటి. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. టాలీవుడ్ లో ఆదిత్య 369 మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్, గుర్తింపు ఉంది. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తో ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోందని మీకు తెలుసా? ఆదిత్య 369కి మించి ఎగ్జైట్మెంట్ తో ఈ సిరీస్ రాబోతోంది.

హాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా యాక్షన్, సైన్స్ ఫిక్షన్, సినిమాలు- వెబ్ సిరీస్లు వచ్చాయి. వాటిని చూసి మనం కూడా ఎంతో ఎంటర్ టైన్ అయ్యాం. కానీ, మనం తెలుగులో చూసిన ఒక కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ వస్తోంది అంటే ఆ ఫీల్ హై ఉంటది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అది ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను నోట్ చేసుకు పెట్టుకోవాలి. ఈ వెబ్ సిరీస్ పేరు “Doctor Who”. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మే 11 నుంచి ఈ సైన్స్ ఫిక్షన్ సిరీస్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుందని హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది.

సాధారణంగా హాలీవుడ్ చిత్రాలు అనగానే తెలుగు ఆడియన్స్ కి ఒక భయం ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడగలమా అని. కానీ, ఈ మూవీకి యూఏ సర్టిఫికేట్ లభించింది. అంటే 13+ వాళ్లు ఈ చిత్రాన్ని చూడచ్చు. పైగా ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అని చిత్ర బృందం కూడా ప్రకటించింది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు కూడా టైమ్ ట్రావెల్, యూనివర్స్ లో తిరగడం వంటివి డీసీ, మార్వెల్ యూనివర్స్ లో చూసేశారు. అలాగే క్రిస్టోఫర్ నోలన్ చిత్రాల్లో కూడా యూనివర్స్, అదర్ ప్లానెట్స్ మీదతు తీసుకెళ్లిపోయాడు.

ఇప్పుడు ఈ ‘డాక్టర్ హూ’ మూవీలో కొత్తగా ఏమి ఉంటుందంటే.. టైమ్ ట్రావెల్ లో ఒకింత డ్రామా, ఒకింత యాక్షన్, మరికొంత ఎమోషన్, ఇంకాస్త అడ్వెంచర్ ని యాడ్ చేసి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతానికి యూట్యూబ్ లో ఈ ట్రైలర్ వైరల్ అవుతోంది. మే 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తెలుగులో ఉంటుందా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. వెబ్ సిరీస్ కాబట్టి దాదాపుగా తెలుగులో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి.. ఈ డాక్టర్ హూ వెబ్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments