LSG vs SRH- Ayush Badoni- Pooran: వీడియో: లక్నోని ఆదుకున్న ఆయూష్ బదోనీ.. సైలెన్సర్ ని సైలెంట్ చేశాడు!

వీడియో: లక్నోని ఆదుకున్న ఆయూష్ బదోనీ.. సైలెన్సర్ ని సైలెంట్ చేశాడు!

LSG vs SRH- Ayush Badoni- Nicholas Pooran: ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో బదోనీ, పూరన్ సూపర్ ఇన్నింగ్స్ నమోదు చేశారు. సైలెన్స్ ను బర్త్ డే రోజు సైలెంట్ చేసేశారు.

LSG vs SRH- Ayush Badoni- Nicholas Pooran: ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో బదోనీ, పూరన్ సూపర్ ఇన్నింగ్స్ నమోదు చేశారు. సైలెన్స్ ను బర్త్ డే రోజు సైలెంట్ చేసేశారు.

లక్నో సూపర్ జెయింట్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో జట్టు టాపార్డర్ కుప్పకూలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సహా నలుగురు వరుసగా పెవిలియన్ చేరారు. కెప్టెన్ అయితే అతి తక్కువ స్ట్రైక్ రేట్ ని నమోదు చేశాడు. ఇలాంటి తరుణంలో లక్నో జట్టు స్కోర్ కేవలం 120లోపే స్కోర్ చేస్తుందని అంతా భావించారు. కానీ, ఆయూష్ బదోనీ- నికోలస్ పూరన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. లక్నో జట్టు పోరాడేందుకు కావాల్సిన స్కోర్ ని తీసుకొచ్చారు. హైదరాబాద్ లో ఉన్న ప్రతి బౌలర్ ని ఈ ఇద్దరూ బాదేశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలుత బాగా తడబడింది. కేఎల్ రాహుల్(29), కృనాల్ పాండ్యా(24), స్టొయినిస్(3), డికాక్(2) మాత్రమే స్కోర్ చేయగలిగారు. లక్నో జట్టు టాపార్డర్ ను కూల్చేయడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు పెద్ద ఇబ్బంది కాలేదు. కానీ, ఆ తర్వాత వచ్చిన ఆయూష్ బదోనీ, నికోలస్ పూరన్ మాత్రం క్రీజులో పాతుకుపోయారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగించారు. 130 పరుగులు కూడా చేయలేరు అనుకునే పరిస్థితి నుంచి ఏకంగా 165 పరుగులకు స్కోర్ కార్డుని చేర్చేశారు.

ముఖ్యంగా ఆయూష్ బదోనీ ఆడిన తీరు అందరినీ మెస్మరైజ్ చేసేసింది. కరెక్ట్ సమయంలో అతని బ్యాట్ నుంచి కరెక్ట్ నాక్ వచ్చింది. బదోనీ ఈ మ్యాచ్ లో 30 బంతులు ఎదుర్కున్నాడు. ఆ బంతుల్లో 9 ఫోర్ల సాయంతో ఏకంగా 55 పరుగులు చేశాడు. తన బ్యాటుతో సైలెన్సర్ గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ని ఈ ఇద్దరూ సైలెంట్ చేసేశారు. కమిన్స్ వేసిన ఆఖరి ఓవర్లో ఏకంగా 19 పరుగులు రాబట్టారు. ఆఖరి ఓవర్లో 4 ఫోర్లు కొట్టారు. తొలి బంతిని ఫోర్ కొట్టిన బదోనీ, ఆ తర్వాత సింగిల్ తీసుకున్నాడు. తర్వాత పూరన్ ఫోర్, 2 పరుగులు, ఫోర్, ఫోర్ కొట్టేశాడు.

ఈ మ్యాచ్ లో పూరన్ కూడా అద్భుతంగా రాణించాడు. అతను 26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 48 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు అవుట్ కాకుండా ఉండటం విశేషం. పూరన్ కి కూడా ఆర్ధ శతకం పూర్తి అయ్యేది. కానీ, ఆఖరి బంతిని నితీశ్ సిక్స్ పోకుండా అద్భుతంగా ఆపడంతో కేవలం 4 పరుగులతో సరిపెట్టుకున్నాడు. అందుకే అర్ధ శతకం మిస్ అయ్యింది. ఇంక హైదరాబాద్ బౌలింగ్ చూస్తే.. భువనేశ్వర్ కుమార్ కు 2 వికెట్లు దక్కాయి. కెప్టెన్ కమ్మిన్స్ ఒక వికెట్ తీశాడు. కృనాల్ పాండ్యాను కమ్మిన్స్ రనౌట్ చేశాడు. మరి.. బదోనీ, పూరన్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments