SRH vs LSG Travis Head Thunder Innings: లక్నో బౌలర్లపై తుఫానులా విరుచుకుపడిన ట్రావిస్ హెడ్.. ఇదేం కొట్టుడు సామి!

Travis Head: లక్నో బౌలర్లపై తుఫానులా విరుచుకుపడిన ట్రావిస్ హెడ్.. ఇదేం కొట్టుడు సామి!

లక్నో బౌలర్లపై సన్​రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తుఫానులా విరుచుకుపడ్డాడు. ఆ జట్టు బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టాడు.

లక్నో బౌలర్లపై సన్​రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తుఫానులా విరుచుకుపడ్డాడు. ఆ జట్టు బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టాడు.

అసలైన టీ20 క్రికెట్ అంటే ఎలా ఉంటుందో చూపించింది సన్​రైజర్స్ హైదరాబాద్. బాదుడుకు నయా డెఫినిషన్ చెబుతూ కీలక మ్యాచ్​లో లక్నో సూపర్ జియాంట్స్​ను చిత్తు చేసింది. రాహుల్ సేన సంధించిన 165 పరుగుల టార్గెట్​ను 9.4 ఓవర్లలోనే ఊది పారేసింది. ఛేజింగ్​లో ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ చెలరేగిపోయారు. విధ్వంసక బ్యాటింగ్​తో అలరించారు. తుఫాను వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో లక్నో బౌలర్లకు ప్రత్యక్షంగా చూపించారు.

అభిషేక్ 28 బంతుల్లో 75 పరుగులు చేయగా.. హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు చేశాడు. హెడ్ అయితే 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకున్నాడు. ఓవరాల్​గా 8 బౌండరీలు బాదిన ఈ మాస్ బ్యాటర్.. 8 భారీ సిక్సులు బాదడం విశేషం. అభిషేక్ కూడా 8 ఫోర్లు, 6 సిక్సులతో లక్నో బౌలర్లకు నరకం చూపించాడు. హెడ్ మొదట్లో చెలరేగగా.. ఆ తర్వాత అభిషేక్ హిట్టింగ్ మొదలుపెట్టాడు. వీళ్ల దెబ్బకు పవర్​ప్లేలోనే స్కోరు బోర్డు మీద 107 పరుగులు చేరాయి. మరి.. అభిషేక్-హెడ్ ఉతుకుడు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments