వ్యాపారికి మోదీపై అభిమానం.. రూ. 200 కోట్లతో 190 అడుగుల విగ్రహం!

వ్యాపారికి మోదీపై అభిమానం.. రూ. 200 కోట్లతో 190 అడుగుల విగ్రహం!

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానాన్ని పలు విధాలుగా చాటుకుంటున్నారు. ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఈ క్రమంలోనే మోడీ పై ఉన్న అభిమానంతో ఓ వ్యక్తి ఏకంగా భారీ ఎత్తున కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానాన్ని పలు విధాలుగా చాటుకుంటున్నారు. ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఈ క్రమంలోనే మోడీ పై ఉన్న అభిమానంతో ఓ వ్యక్తి ఏకంగా భారీ ఎత్తున కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

సాధారణంగా ఒకప్పుడు విగ్రహాలు అంటే దేవుళ్ళు , దేవతలకు మాత్రమే కట్టించేవారు. ఆ తర్వాత రాను రాను తమ అభిమాన నటి నటులు, రాజకీయ నాయకులు, సమాజ అభివృద్ధి కోసం పోరాడే వారు.. ఇలా వారి గుర్తుగా విగ్రహాలను కడుతూ వస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి విగ్రహాలను కొన్ని ప్రాంతాలలో చూస్తూ వస్తున్నాము. ఈ క్రమంలోనే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహం కూడా త్వరలో ఏర్పాటు కానుంది. అది కూడా 190 అడుగుల కాంస్య విగ్రహం. నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానంతో ఓ వ్యక్తి.. తన సొంత స్థలంలో.. తన ఖర్చుతో ఈ విగ్రహాన్ని కట్టించనున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఈ విగ్రహం కట్టించడం వెనుక ఉన్న కారణాలేంటి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం.

నరేంద్ర మోడీ మన దేశానికీ చేస్తున్న సేవ గురించి అందరికి తెలుసు. ఎంతో మంది ప్రజలకు ఆదర్శవంతంగా నిలుస్తోంది ఆయన జీవితం. మరి అటువంటి వ్యక్తి అంటే ఎవరికీ మాత్రం అభిమానం ఉండదు. అలానే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి కూడా నరేంద్ర మోడీ అంటే ఎనలేని ప్రేమ , అభిమానం . ఏడేళ్ల కిందట సుమారు 2016లో ఓ సందర్భంలో ప్రధాని చేతులు మీదుగా ప్రశంసా పత్రం కూడా అందుకున్నారు. ఇక అప్పటినుంచి నరేంద్ర మోడీ కోసం ఏమైనా చేయాలి అనే ఆలోచనలో ఉండేవారట. ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ భారీ విగ్రహ ఏర్పాటు. తన సొంత స్థలంలో, సొంత ఖర్చుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆయనే అసోంకి చెందిన వ్యాపారవేత్త నవీన్‌చంద్ర బోరా.

కాగా, గువాహటి నగరానికి సమీపంలో ఉన్న తన స్థలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాట్లను ప్రారంభించారు ఈ వ్యాపారి. దీనికోసం ఇటీవలే ఏకంగా మూడు రోజుల పాటు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. అయితే , ఈ విగ్రహం పీఠభాగంతో కలుపుకొని 250 అడుగులు ఉంటుందని నవీన్‌చంద్ర తెలిపారు. అంతేకాకుండా మెడ భాగంలో అసోం సంస్కృతికి చిహ్నంగా గమోసా (అసోం ప్రజలు ధరించే ఖద్దరు వస్తం) ఉంటుందని ఆయన తెలియజేశారు. అలాగే విగ్రహ ప్రతిష్ఠాపన వివరాలకు సంబంధించిన విషయాలను.. గత ఏడాదే ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు తెలిపారు. నవీన్ చంద్ర ఈ విగ్రహ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.200 కోట్లను కేటాయించినట్లు సమాచారం.

కాగా.. విగ్రహానికి సంబంధించి డిజైన్ కూడా సిద్ధమైందని చెప్పారు. పైగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని ఆశిస్తున్నాను అని కూడా ఆయన తెలియజేశారు. ఇదంతా నరేంద్ర మోడీపై ఉన్న ప్రేమ కారణంగానే చేస్తున్నానని. ప్రపంచంలో ఉన్న ఎందరో ఉత్తమ ప్రధానుల్లో నరేంద్ర మోడీ ఒకరని. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు తానూ ఎంతో అదృష్టం చేసుకున్నానని.. నవీన్ చంద్ర వ్యక్తపరిచారు. ఏదేమైనా నరేంద్ర మోడీ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహం కట్టించాలి అనుకోవడం చాలా గొప్ప ఆలోచన. ఇప్పటి ప్రజలకు మాత్రమే కాకుండా.. రాబోయే తరాలకు కూడా ఆయన ఎంతో స్ఫూర్తి దాయకంగా నిలుస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి, త్వరలో ఏర్పాటు కానున్న 190 అడుగుల నరేంద్ర మోడీ కాంస్య విగ్రహంపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments