Shakib Al Hasan: బుద్ది మార్చుకోని షకీబ్.. సెల్ఫీ అడిగినందుకు కాలర్ పట్టుకుని..! వీడియో వైరల్..

Shakib Al Hasan: బుద్ది మార్చుకోని షకీబ్.. సెల్ఫీ అడిగినందుకు కాలర్ పట్టుకుని..! వీడియో వైరల్..

బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన తీరును ఇంకా మార్చుకోలేదు. ఎన్నిసార్లు ఇలా జరిగినా కానీ.. బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచి విమర్శలపాలవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన తీరును ఇంకా మార్చుకోలేదు. ఎన్నిసార్లు ఇలా జరిగినా కానీ.. బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచి విమర్శలపాలవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తరచుగా ఏదో ఒక వివాదంతో న్యూస్ నిలవడం ఈ స్టార్ ప్లేయర్ కు బాగా అలవాటు అయ్యిందేమో. ఇప్పటికే ఎన్నో సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు షకీబ్. గ్రౌండ్ లో అంపైర్లతో, ప్లేయర్లతో గొడవలకు దిగడం మనకు తెలిసిన విషయమే. ఇక కోపంతో వికెట్లను తన్నడం ఇతడికి పరిపాటే. అభిమానులపై కూడా గతంలో చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ని సంఘటనలు జరిగినా కూడా షకీల్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు. సెల్ఫీ అడిగినందుకు గ్రౌండ్ మెన్ ను దారుణంగా అవమానించాడు.

సాధారణంగా తమ అభిమాన క్రికెటర్లతో సెల్ఫీలు దిగాలని, షేక్ హ్యాండ్ తీసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు అభిమానులు. ఒక్క సెల్ఫీ, షేక్ హ్యాండ్ ఇస్తే చాలు.. మురిసిపోతారు ఫ్యాన్స్. అయితే కొందరు ఆటగాళ్లు ఫొటోలు ఇవ్వడానికి అంతగా ఇష్టపడరు. ఇవ్వకపోతే బాధలేదు కానీ.. షకీబ్ అల్ హసన్ లా చేస్తే మాత్రం ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొస్తుంది. తాజాగా మరోసారి అతడు చేసిన పనికి విమర్శల పాలవుతూ.. వార్తల్లో నిలిచాడు షకీబ్. ఇంతకీ అతడు ఏం చేశాడంటే?

జింబాబ్వే సిరీస్ కోసం బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మెుదలుపెట్టారు. బంగ్లా స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కూడా గ్రౌండ్ లో తన సహచర ఆటగాళ్లతో ముచ్చట్లు పెడుతున్నాడు. ఈ సమయంలో ఓ గ్రౌండ్ మెన్(అభిమాని) వచ్చి షకీబ్ ను సెల్ఫీ అడిగాడు. దానికి షకీబ్ ఫొటో ఇవ్వకపోగా.. అతడిని కాలర్ పట్టుకుని అవతలికి పో..అంటూ సెల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. కోపంగా అతడిని పక్కకి నెట్టేశాడు, కొట్టే ప్రయత్నం కూడా చేశాడు. దాంతో పాపం ఆ గ్రౌండ్ మెన్ చేసేది ఏం లేక సైలెంట్ గా నిరాశగా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. షకీబ్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు. మ్యాచ్ కు పిచ్ ను సిద్ధం చేసే గ్రౌండ్ మెన్స్ పై ఇలా దౌర్జన్యం చేయడం ఏం బాలేదు. ఎన్నో సంఘటనలు జరిగినా కానీ నీకు ఇంకా బుద్దిరాలేదా? అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మరి గ్రౌండ్ మెన్ పై షకీబ్ అల్ హసన్ వ్యవహరించిన తీరు మీకేవిధంగా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments