యూపీ ఎన్నికల్లో తెలుగు బిడ్డకు ఘోర అవమానం! ఏం జరిగిందంటే..

యూపీ ఎన్నికల్లో తెలుగు బిడ్డకు ఘోర అవమానం! ఏం జరిగిందంటే..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తై.. మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల వేళ కొన్ని ఆసక్తికర వార్తలు వెలుగు చూస్తుంటాయి.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తై.. మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల వేళ కొన్ని ఆసక్తికర వార్తలు వెలుగు చూస్తుంటాయి.

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తై.. మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల వేళ కొన్ని ఆసక్తికర వార్తలు వెలుగు చూస్తుంటాయి. అప్పటి వరకు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన వ్యక్తులు.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫేమస్ అవుతుంటారు. ఇప్పుడు తాజాగా అలాంటి వార్తే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ పోటీ చేయనున్నసంగతి తెలిసిందే. అయితే ఆమెకు తాజాగా నిరాశే ఎదురైంది. బీఎస్సీ పార్టీ నుంచి ఆమె పోటీ చేయాలనుకున్నారు. అయితే చివర్లో ఆమెకు పార్టీ బీ ఫామ్ ఇవ్వలేదు. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్ పుర్ పార్లమెంట్ స్థానం నుంచి తెలంగాణకు చెందిన శ్రీకళా రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఆమెకు గతంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లోక్ సభ టికెట్ ఇచ్చింది. శ్రీకళారెడ్డి పుట్టింది తెలంగాణలో కానీ ఆమె అత్తగారిల్లు మాత్రం ఉత్తర్ ప్రదేశ్. శ్రీకళారెడ్డి భర్త ధనుంజయ్ సింగ్ జౌన్‌పుర్ మాజీ ఎంపీ. ఆయన స్థానికంగా  మంచి ధనవంతుడు, అలానే బీఎస్పీ అధినేత్రి మాయవతికి బాగా సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. అయితే ఈసారి ఆయనకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. గతంలో కిడ్నాప్, దోపిడీ కేసులో ఆయన జైలుకు వెళ్లడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు నిషేధం విధించింది. దీంతో కొన్ని రోజుల క్రితం జౌన్‌పుర్ ఎంపీ టికెట్‌ను ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళారెడ్డికి కేటాయించింది.ఇక ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కృపాశంకర్‌ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబు సింగ్‌ కుష్వాహా బరిలోకి దిగారు.

ఎన్నికల సమీపిస్తున్న వేళ బీఎస్పీ నుంచి ఈ తెలుగు మహిళకు  బిగ్ షాక్ ఎదురైంది. బీఎస్పీ అధినేత మాయవతి శ్రీకళా రెడ్డికి గట్టి షాకిచ్చారు. చివరి నిమిషంలో ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.  అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్యామ్ సింగ్  యాదవ్ నే బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేశారు. నాలుగు రోజుల క్రితమే శ్రీ కళారెడ్డి నామినేషన్ వేశారు. కానీ ఆమెకు మాయవతి బీ ఫామ్ ఇవ్వలేదు. దీంతో ఆమెకు తీవ్ర నిరాశే ఎదురైంది. జౌన్ పూర్ లో  మే 25న ఐదో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

ఇక శ్రీకళా రెడ్డి కుటుంబ విషయానికి వస్తే.. ఆమె పొలికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆమె స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా నడిగూడెం మండలం రత్నవరం. ఆమె తండ్రి జితేందర్‌రెడ్డి నల్గొండ జిల్లా కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు. అలానే 1972లో హుజూర్ నగర్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంతో పేరున్న నిప్పో బ్యాటరీ గ్రూప్‌ కంపెనీ ఈమె కుటుంబానికి చెందినదే. ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఇక త్వరలో యూపీ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచి ఆమె పార్లమెంట్ లో అడుగుపెట్టాలని భావించారు. ఈ క్రమంలోనే ఆమెకు గట్టి షాక్ తగ్గిలింది.

Show comments