Gold & Silver Rate-May 8th 2024: అక్షయ తృతీయకు బంగారం కొనాలనుకుంటున్నారా.. మీకు నిరాశే

Gold Rate: అక్షయ తృతీయకు బంగారం కొనాలనుకుంటున్నారా.. మీకు నిరాశే

అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలని భావించే వారికి నేటి ధర ఒక్కసారిగా షాకిచ్చింది. ఇవాళ పసిడి రేటు భారీగా పెరిగింది. ఆ వివరాలు..

అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలని భావించే వారికి నేటి ధర ఒక్కసారిగా షాకిచ్చింది. ఇవాళ పసిడి రేటు భారీగా పెరిగింది. ఆ వివరాలు..

అక్షయ తృతీయ రానుంది. మే 10, శుక్రవారం నాడు ఈ పండుగ. ఇక అక్షయ తృతీయ వేళ బంగారం కొంటే బాగా కలసి వస్తుందని మన దగ్గర చాలా మంది నమ్ముతారు. దాంతో చాలా మంది ఆరోజు గోల్డ్‌ కొనాలని భావిస్తారు. అక్షయ తృతీయ అనే కాదు.. దాదాపు ప్రతి పండుగ వేళ ఎంతో కొంత బంగారం కొనడానికి మన వాళ్లు ఆసక్తి చూపుతారు. ఇక అక్షయ తృతీయ వేళ పసిడి కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగానే జ్యువెలరీ షాపులు కూడా భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తరుగు, మేకింగ్‌ ఛార్జీల మీద డిస్కౌంట్లు, ఉచిత బహుమతులు వంటి ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో అక్షయ తృతీయ వేళ బంగారం కొందామని భావిస్తున్న వారికి నిరాశ ఎదురయ్యే పరిస్థితి. గత కొన్ని రోజులుగా దిగి వస్తోన్న ధర.. నేడు ఒక్కసారిగా పెరిగి షాకిచ్చింది.

ఏప్రిల్‌ నెలలో దూసుకుపోయిన బంగారం ధర.. యూఎస్‌ ఫెడ్‌ ప్రకటనతో క్రమంగా దిగి రాసాగింది. దాంతో చాలా మంది అక్షయ తృతీయ నాటికి బంగారం ధర భారీగానే దిగి వస్తుంది.. కొందామని భావించారు. కానీ వారి ఆశలు వమ్ము చేస్తూ.. నేడు పసిడి రేటు ఒక్కసారిగా పెరిగి షాకిచ్చింది. ఇక ఇవాళ దేశ రాజధాని, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ పసిడి ధర పది గ్రాముల మీద 300 రూపాయలు పెరిగింది. దాంతో నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటు రూ. 66,350 మార్కు వద్ద ఉంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి పుత్తడి రేటు కూడా పది గ్రాముల మీద 330 రూపాయలు పెరిగి.. రూ. 72,380 వద్ద కొనసాగుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. నేడు హస్తినలో బంగారం రేటు పైకి ఎగబాకింది. 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల మీద 300 రూపాయలు పెరిగింది. నేడు ఢిల్లీలో 22 క్యారెట్‌ పసిడి 10 గ్రాముల రేటు రూ. 66,500 పలుకుతుండగా.. 24 క్యారెట్ల ధర రూ. 330 ఎగబాకి 10 గ్రాములు రూ. 72,530 వద్ద ఉంది.

భారీగా పెరిగిన వెండి ధర..

నేడు బంగారం ధర పెరగ్గా.. వెండి కూడా అదే బాటలో పయనించింది. కిలో సిల్వర్‌ రేటు భారీగా పెరిగి షాకిచ్చింది. నేడు ఒక్క రోజే వెండి ధర కేజీ మీద 1000 రూపాయలు పెరిగింది. క్రితం రోజు కూడా ఇది వెయ్యి రూపాయలు పెరగడం గమనార్హం. ఇక నేడు హైదరాబాద్‌లో వెండి ధర కిలో మీద 1000 పెరిగి.. 88,500 వద్ద ఉంది. ఢిల్లీలో కూడా సిల్వర్‌ రేటు కేజీ

Show comments