CSIR, Wear Wrinkled Clothes: ఆ ఒక్కరోజు ఇస్త్రీ బట్టలు వేసుకోకండి.. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆదేశం!

ఆ ఒక్కరోజు ఇస్త్రీ బట్టలు వేసుకోకండి.. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆదేశం!

CSIR, Wear Wrinkled Clothes: సాధారణంగా ఉద్యోగులు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఐరన్ చేసిన దుస్తులు వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్తుంటారు. తాజాగా ఓ సంస్థ మాత్రం తన ఉద్యోగులను ఆ ఒక్క రోజు ముడత బట్టలు వేసుకుని రావాలని ఆదేశించింది. మరి.. ఆ వివరాలు..

CSIR, Wear Wrinkled Clothes: సాధారణంగా ఉద్యోగులు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఐరన్ చేసిన దుస్తులు వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్తుంటారు. తాజాగా ఓ సంస్థ మాత్రం తన ఉద్యోగులను ఆ ఒక్క రోజు ముడత బట్టలు వేసుకుని రావాలని ఆదేశించింది. మరి.. ఆ వివరాలు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ హితం, సమాజా శ్రేయస్సు వంటి అనేక ఇతర విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజలను ఉద్దేశించి కొన్ని నిర్ణయాలు ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మరికొన్ని డెసిషన్స్ ఉంటాయి. ఇటీవలే ఓ రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు యూనిఫామ్ తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చింది. అలానే ఢిల్లీ ప్రభుత్వం ట్రాఫిక్ కంట్రోల్ లో వెహికల్ రోడ్లపైకి వచ్చే విషయంలో సరి, బేసి విధానాన్ని అమలు చేస్తుంది. అలానే  పలు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సంస్థ ఉద్యోగులను  ఇస్త్రీ బట్టలు వేసుకోవద్దని చెప్పింది. మరి.. ఆ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

సాధారణంగా ఉద్యోగులు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఐరన్ చేసిన దుస్తులు వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్తుంటారు. ప్రతి రోజూ వారు వేసుకోవాల్సిన బట్టలును ఇస్త్రీ చేసుకుని మరీ సిద్దంగా పెట్టుకుంటారు. తాజాగా ఓ కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ కూడా తమ ఉద్యోగుల డ్రెస్  విషయంలో వెరైటీ నిర్ణయం తీసుకుంది. సోమవారం ముడతలతో ఉన్న బట్టలు వేసుకోవాలని రావాలి, ఇస్త్రీ చేసుకోవద్దని కౌన్సిల్‌ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌ (సీఎస్ఐఆర్) తన సిబ్బందిని కోరింది. ఇందులో భాగంగా ‘వాహ్‌ మండేస్‌’ అనే కొత్త కార్యక్రామని ప్రారంభించింది. ముడతలు మంచివే అంటూ ఆ సంస్థ కొత్త నినాదాన్ని అందుకుంది.

ప్రతీ సోమవారం ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పర్యావరణహితం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఇక సీఎస్ఐఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ సంస్థ తొలి మహిళా డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కళ్లై సెల్వి స్పందించారు.ఇంధన వినియోగంపై అవగాహనలో భాగంగా ‘వాహ్‌ మండేస్‌’ను చేపట్టినట్టు ఆమె తెలిపారు.  మనం ఒక జత బట్టలను ఇస్త్రీ చేసినప్పుడు గాల్లోకి 200 గ్రాముల CO2 విడుదలవుతుందని, ముడతల బట్టలు వేసుకోవడం వల్ల ఆ కాలుష్యాన్ని నివారించవచ్చని ఆమె తెలిపారు.

ఇంధన వినియోగం, ఆదాపై మే 1-15 వరకు స్వచ్ఛాతా పక్వాడా ప్రోగ్రామ్ సీఎస్ఐఆర్ నిర్విహస్తోందని ఆమె తెలిపారు. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొని కొన్ని నిబంధనలను రూపొందించనట్లు ఆమె తెలిపారు. ఆఫీసుల్లో కరెంట్ ఛార్జీలను 10 శాతానికి తగ్గించడం మొదటి లక్ష్యమని కళైసెల్వి అన్నారు. ఎర్త్‌ డే వేడుకల్లో భాగంగా గత నెల ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో అతిపెద్ద క్లైమేట్ క్లాక్‌ను సీఎస్ఐఆర్ ఏర్పాటు చేసిందని ఆమె అన్నారు. అలానే కర్బన ఉద్గారాల విడుదల, పర్యావరణ మార్పుల గురించి ఇది గ్రాఫ్ రూపంలో  తెలియజేస్తుందని ఆమె  తెలిపారు. ఎర్త్ ను, గ్రహాన్ని రక్షించడానికి  తనవంతుగా సీఎస్ఐఆర్ సహకారం ఇదని కళైసెల్వి అన్నారు.

Show comments