Heavy Rains IMD Alert To TS & AP: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.. పిడుగులు పడే ఛాన్స్‌

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.. పిడుగులు పడే ఛాన్స్‌

Heavy Rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు..

Heavy Rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు..

ఈ ఏడాది మార్చి నుంచి మండే ఎండలతో బాధపడుతున్న ప్రజలకు మంగళవారం కాస్త ఊరట లభించింది. నిన్నటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మంగళవారం సాయంత్రం మాత్రం ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. అప్పటి వరకు మండే ఎండలతో ఉక్కిరి బిక్కిరి అయిన జనాలు.. ఒక్కసారిగా కురిసిన వానతో.. హమ్మయ్య అనుకున్నారు. ఇక హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల రోడ్ల మీద నీరు నిలిచపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి గంటల తరబడి రోడ్ల మీద నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక అలర్ట్‌ జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేయగా.. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అంటున్నారు.

మండే ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏపీ వాసులు.. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఉపరితల ద్రోణి కారణంగా.. రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 2 గంటల పాటు ఎడతెరిపి లేని వాన కురిసింది. జిల్లాలోని వేమగిరిలో 124.5మిమీ వర్షపాతం నమోదు కాగా.. కోనసీమ జిల్లా మండపేటలో 120.5 మిమీ, రాజమహేంద్రవరంలో 92 మిమీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో.. బుధవారం శ్రీకాకుళం, అల్లూరి, నెల్లూరి, పల్నాడు. బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కావున ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇక తెలంగాణలో కూడా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్‌లో 13.3, కూకట్‌పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక బుధవారం నాడు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.

Show comments