పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా?.. జాగ్రత్త.. 10 వేల ఫైన్ పడుతుంది.. ఎందుకో తెలుసా?

పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా?.. జాగ్రత్త.. 10 వేల ఫైన్ పడుతుంది.. ఎందుకో తెలుసా?

వాహనదారులకు బిగ్ అలర్ట్. మీ వాహనాల్లో పెట్రోల్, డీజిల్ కొట్టించేందుకు పెట్రోల్ బంకులకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. 10 వేల ఫైన్ పడుతుంది. ఎందుకంటే?

వాహనదారులకు బిగ్ అలర్ట్. మీ వాహనాల్లో పెట్రోల్, డీజిల్ కొట్టించేందుకు పెట్రోల్ బంకులకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. 10 వేల ఫైన్ పడుతుంది. ఎందుకంటే?

వాహనం నడవాలంటే ఇంధనం కావాలి.. ఇంధనం కావాలంటే పెట్రోల్ బంకుకు వెళ్లాలి. అయితే ఇప్పటి వరకు పెట్రోల్ బంక్ కు వెళ్లే వారు తమకు కావాల్సినంత పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకుని ఎంచక్కా వెళ్లిపోయేవారు. కాని ఇప్పుడు పెట్రోల్ బంకులకు వెళ్లే వాహనదారులకు బిగ్ షాక్ తగలబోతోంది. మీ వాహనానికి సంబంధించి ఆ ఒక్కటి లేకపోతే జేబుకి చిల్లుపడ్డట్టే. ఏకంగా 10 వేల రూపాయాల ఫైన్ కట్టాల్సి వస్తుంది. ట్రాఫిక్ అధికారులు కొత్త నిబంధనలను తీసుకువస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారుల్లో మార్పు రావాలంటే పెట్రోల్ బంకుల వద్ద ఫైన్ విధించాలని.. అలా అయితే ఎవరూ తప్పించుకోలేరని అధికారులు భావిస్తున్నారు. ఇంతకీ ఏ కారణంగా ఫైన్ విధించనున్నారు అంటే?

ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠినమైన నియమాలను తీసుకువచ్చి అమలు పరుస్తున్నారు. కానీ కొంత మంది వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. వారికి ఎన్నిసార్లు ఫైన్ విధించినా కూడా మార్పు రావడం లేదు. ఇక ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు కొత్త రూల్ ను ప్రవేశపెడుతున్నారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ చెక్ చేస్తుంటారు. వీటిల్లో ఏ ఒక్కటి లేకున్నా ఫైన్ వేస్తారు. అయితే కొన్ని సందర్బాల్లో వాహనదారులు పోలీసు అధికారులకు అడిగినంత ఇచ్చి మెల్లగా జారుకుంటారు. ఇక నుంచి అలా కుదరదు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు.

ఈ నియమం ప్రకారం.. ఇకపై చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ జరిమానాలు విధించనున్నారు. ఏకంగా రూ.10 వేల వరకు జరిమానా విధించనున్నారు. పొల్యూషన్ సర్టిఫికేట్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇకపై పొల్యూషన్ సర్టిఫికేట్ లేని కార్లు రిజిస్ట్రేషన్ నుంచి బ్లాక్ లిస్ట్ చేయబడతాయి. పెట్రోల్ బంకుల వద్ద ఆధునిక కెమెరాలతో వాహనాల నంబర్‌ ప్లేట్లను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని గుర్తించినప్పుడు యజమాని మెుబైల్ నంబర్ కు ఎస్ఎమ్ఎస్ రూపంలో జరిమానా వివరాలు పంపిస్తారు. ఈ ఫైన్ నుంచి తప్పించుకోవాలంటే వ్యాలిడిటీ కలిగిన పొల్యూషన్ సర్టిఫికేట్ ను దగ్గరుంచుకోవాల్సి ఉంటుంది.

Show comments