వన్డే WC 2023లో చేసిన దానికి పూర్తి ఆపోజిట్‌గా చేసిన కమిన్స్‌! ఎందుకిలా?

వన్డే WC 2023లో చేసిన దానికి పూర్తి ఆపోజిట్‌గా చేసిన కమిన్స్‌! ఎందుకిలా?

Pat Cummins, KKR vs SRH, World Cup 2023: తొలి క్వాలిఫైయర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి పాలైంది. అయితే.. ఈ ఓటమికి కమిన్స్‌ కారణం అయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. పైగా దానికి వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్‌ను కూడా లింక్‌ చేస్తూ విమర్శలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Pat Cummins, KKR vs SRH, World Cup 2023: తొలి క్వాలిఫైయర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి పాలైంది. అయితే.. ఈ ఓటమికి కమిన్స్‌ కారణం అయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. పైగా దానికి వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్‌ను కూడా లింక్‌ చేస్తూ విమర్శలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే.. ఎస్‌ఆర్‌హెచ్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకునేది. కానీ, ఓడిపోవడంతో క్వాలిఫైయర్‌-2 ఆడాల్సి వస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమిపై పలు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌హెచ్‌ సూపర్‌గా నడిపించిన కెప్టెన్‌ కమిన్స్‌పై క్రికెట్‌ అభిమానులు ఒక రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ఈ క్వాలిఫైయర్‌-1 మ్యాచ్‌ అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. ఇదే స్టేడియంలో గతేడాది వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఇండియా జట్లు పోటీ పడ్డాయి. అప్పటి వరకు వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఓటమి ఎరుగని టీమ్‌గా సంచలన విజయాలు సాధించిన రోహిత్‌ సేన.. అనూహ్యంగా ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అప్పుడు ఆసీస్‌ కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్యాట్‌ కమిన్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవరిస్తున్నాడు. అప్పుడు ఫైనల్‌లో కమిన్సే టాస్‌ గెలిచాడు. ఇప్పుడు కూడా అతనే టాస్‌ గెలిచాడు. ఆ ఫైనల్‌లో తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న కమిన్స్‌.. ఇప్పుడు మాత్రం తొలుత బ్యాటింగ్‌ చేయాలనే ఒక రాంగ్‌ డిసిషన్‌ తీసుకున్నాడు. ఇదే గ్రౌండ్‌లో అంత పెద్ద మ్యాచ్‌ ఆడిన అనుభవం ఉన్న కమిన్స్‌.. ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా తొలుత బ్యాటింగ్‌ తీసుకున్నాడని అంతా షాక్‌ అవుతున్నారు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌పై కమిన్స్‌కు నమ్మకం పెరిగిపోయి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌గా మారిందా? లేక ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఛేజింగ్‌ చేసే మ్యాచ్‌లు ఓడిపోవడం వల్ల ఇలా చేశాడా? అనే అర్థం కావడం లేదు. ఒక్క కమిన్స్‌ అనే కాదు. ఇండియాతో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ క్యాచ్‌ను అద్భుతంగా పట్టుకున్న ట్రావిస్‌ హెడ్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు. పైగా.. ఆ ఫైనల్‌లో సెంచరీతో చెలరేగాడు. కానీ, ఇప్పుడు మాత్రం డకౌట్‌ అయ్యాడు. ఇండియాతో జరిగిన ఫైనల్‌లో బుమ్రా బౌలింగ్‌లో బీట్‌ అవుతూ ఇబ్బంది పడి హెడ్‌.. అవుట్‌ కాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం స్టార్క్‌ దెబ్బకు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇలా గతేడాది జరిగి వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఇండియాలా ఎస్‌ఆర్‌హెచ్‌, ఆస్ట్రేలియాలా కేకేఆర్‌ టీమ్స్‌ ఆడాయి. అయితే.. అప్పుడు ఇప్పుడు కెప్టెన్‌గా ఉన్న కమిన్స్‌ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు సన్‌రైజర్స్‌ కొంపముంచిందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. దేశానికి ఆడేటప్పుడు అన్ని ఆలోచించి.. ఏది సరైంది అయితే అదే చేసే కమిన్స్‌.. సన్‌రైజర్స్‌ విషయంలో మాత్రం అవేవి పట్టించుకోకుండా ఏదో ఒకటి అన్నట్లు వ్యవహరించాడా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments