Instagram Reel: ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. 100 అడుగుల నీటిలో దూకి!

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. 100 అడుగుల నీటిలో దూకి!

Instagram Reel: నేటి కాలంలో సోషల్ మీడియా యుగం అందుబాటులోకి రావడంతో యువత అందులోనే కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు టిక్ టాక్ వీడియోలు, రీల్స్, ఇతర వీడియోలు చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అలా చేసే ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

Instagram Reel: నేటి కాలంలో సోషల్ మీడియా యుగం అందుబాటులోకి రావడంతో యువత అందులోనే కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు టిక్ టాక్ వీడియోలు, రీల్స్, ఇతర వీడియోలు చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అలా చేసే ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా ట్రెడ్ నడుస్తోంది. దాదాపు అందరికి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అంతేకాక చాలా మందికి ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. పాలు తాగే పసి పిల్లాడి నుంచి కాటికి కాలు చాపిన వృద్ధుడి వరకు అందరూ సెల్ ఫోన్ లోనే మునిగిపోతున్నారు. ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ చూస్తూ, చేస్తూ సోషల్ మీడియా అనే సముద్రంలో మునిగిపోతున్నారు. ఇదే సమయంలో కొందరు ఫేమస్ అయ్యేందుకు రీల్స్, షాట్స్ చేస్తున్నారు. కొందరు ఫాలోవర్స్ పెంచుకోవాలని రకరకాలుగా రీల్స్ చేస్తున్నారు. ఇలా రీల్స్ మోజులో పడిన ఓ యువకుడు..100 అడుగుల నీటిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లో వెళ్తే..

నేటి కాలంలో సోషల్ మీడియా యుగం అందుబాటులోకి రావడంతో యువత అందులోనే కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు టిక్ టాక్ వీడియోలు, రీల్స్, ఇతర వీడియోలు చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం చాలా మంది ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలని భావిస్తున్నారు. ఇక క్రమంలో అందరి కంటే భిన్నంగా తన వీడియోలు ఉండాలని, అందరూ లైక్ చేయాలని చేసే ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.అయితే అచ్చం ఇలాగే రీల్స్ మోజులో పడి ఓ యువకుడు..100 అడుగుల నీటిలో దూకి అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో వైరల్ గా మారుతోంది.

జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో తౌసిఫ్ అనే 18 ఏళ్ల యువకుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే తరచూ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తుండే వాడు. సోమవారం కూడా ఇన్ స్టా రీల్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అలా రీల్స్ చేసేందుకు నీళ్లు ఉన్న క్వారీ వద్దకు వెళ్లాడు. సోమవారం సాయంత్రం తౌసిఫ్ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి క్వారీ సరస్సులోకి దూకాడు. కాసేపు అలా నీటిలో ఈదాడు. కానీ తనను తాను నియంత్రించుకోలేక.. అందులో మునిగిపోయి చనిపోయాడు.

నీటిలో పడిపోయిన ఆ యువకుడు బయటకు రాకపోవడంతో  అతని స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నం చేశారు. వారు విశ్వ ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువకుడు మృతి చెందిది నిర్జీవంగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  వారు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి..యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ కుష్వాహా పలు విషయాలను తెలియజేశాడు. నీటిలోకి దూకిన తరువాత తనను తాను నియంత్రించుకోలేక సదరు యువకుడు నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు. ప్రస్తుతం యువకుడు లోతైన నీటిలో దూకిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.  ఇలా ఎంతో మంది రీల్స్ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

Show comments