Rave Party-Type Of Activities: 50 లక్షలు పెట్టి.. రేవ్ పార్టీకి దేనికి పోతారు? ఆడ, మగకి నో రూల్స్, నో లిమిట్స్!

Rave Party: 50 లక్షలు పెట్టి.. రేవ్ పార్టీకి దేనికి పోతారు? ఆడ, మగకి నో రూల్స్, నో లిమిట్స్!

గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవ్‌ పార్టీ పేరు గట్టిగా వినిపిస్తోంది. అక్కడే జరిగే దారుణాల గురించి జోరుగా చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..

గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవ్‌ పార్టీ పేరు గట్టిగా వినిపిస్తోంది. అక్కడే జరిగే దారుణాల గురించి జోరుగా చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..

రెవ్‌ పార్టీ.. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. బెంగళూరు శివారులో ఆదివారం రాత్రి జరిగిన రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీకి వచ్చిన వారిలో చాలా వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ రేవ్‌ పార్టీలో టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌, నటి హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీకాంత్‌ తనకు ఈ పార్టీతో అసలు సంబంధమే లేదని స్పష్టం చేయగా.. హేమ మాత్రం కవర్‌ చేసుకునే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా బుక్కయ్యింది. పైగా ఆమె రేవ్‌ పార్టీలో ఉన్నట్లు బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఈ రెండు రోజుల నుంచి మీడియా, సోషల్‌ మీడియా ఇలా ఎక్కడ చూసిన రేవ్‌ పార్టీ వార్తలే కనిపిస్తున్నాయి. జనాలు సైతం అసలు రేవ్‌ పార్టీ అంటే ఏంటి.. అక్కడ ఏం చేస్తారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

రేవ్‌ పార్టీ అంటే మన బర్త్‌డే పార్టీల్లాంటిందే అనుకుంటే.. పబ్బులో కాలేసినట్లే. సామాన్యుల ఇళ్లలో పార్టీలంటే నాన్‌ వెజ్‌, మందు. అదే బాడాబాబుల ఇళ్లలో పార్టీలు అంటే రకరకాల మద్యం బ్రాండ్లు, ఫుడ్డు, దానితో పాటు అమ్మాయిలు కూడా ఉంటారనే టాక్‌ ఉంది. మరి రేవ్‌ పార్టీ అంటే అంతకు మించి. ఇక్కడ మందు, చిందుతో పాటు డ్రగ్స్‌, విశృంఖల శృంగారం ప్రధానం అంటున్నారు. రేవ్‌ అనేది ఇంగ్లీష్‌ వర్డ్‌. ఎక్సైటింగ్‌ అనే అర్థంలో వాడతారు. అంటే ఈ పార్టీలు కూడా అలానే ఎక్సైటింగ్‌ అన్నమాట.

ఈ పార్టీలు చాలా సీక్రెట్‌గా జరుగుతాయి. ఎక్కువగా నగర శివార్లలోనే వీటిని కండక్ట్‌ చేస్తారు. పైగా ఇవి ఇల్లీగల్‌. ఇక ఈ పార్టీల్లోకి ఎవరికి పడితే వారికి ఎంట్రీ ఉండదు. పార్టీకి ఎంత మంది రావాలని ముందే నిర్ణయిస్తారు. చివరి నిమిషంలో కొత్త వారికి అనుమతి ఇవ్వడం వంటివి ఉండవు. చాలా తక్కువ సంఖ్యలో ఈ పార్టీకి ఎంట్రీలు ఇస్తారు.

మహిళలే ఎక్కువ..

ఇక రేవ్ పార్టీకి వెళ్లాలంటే.. 50 లక్షల ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఇక రేవ్‌ పార్టీకి వచ్చే వారిలో 25 శాతం మగవాళ్లు ఉంటే.. 75 శాతం మహిళలు ఉంటారు. అంటే 100 మందికి ఆహ్వానం ఉంటే వీరిలో 25 మంది మగవాళ్లు ఉంటే.. మిగతా 75 మంది ఆడవాళ్లే ఉంటారు. ఇక వీరందరికి పార్టీ నిర్వహణకు ముందుగానే పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేస్తారు. ఎస్‌టీడీ, ఎయిడ్స్‌ వంటి రోగాలు ఉన్న వారిని అనుమతించరు. ఇక ఒక్కసారి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చామంటే మొబైల్స్‌ ఆఫ్‌ చేయాలి. కెమరాలు తీసుకెళ్లకూడదు. అక్కడ సీసీ కెమరాలు ఉండవు. లోపల ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదు. ఇక రేవ్‌ పార్టీలో మందు, డ్రగ్స్‌తో పాటు.. విశృంఖల శృంగారం కీలకం.

ఈ పార్టీకి వచ్చే వారిలో అమ్మాయిలే ఎక్కువ. ఇక ఒక్కో అమ్మాయి.. నలుగురైదుగురు అబ్బాయిలతో శృంగారంలో పాల్గొంటుంది. రాత్రంతా మద్యం, డ్రగ్స్‌, శృంగారం ఇదే పని. ఇక్కడకు కొందరు బడా బాబులు తమ భార్యల కోర్కెలను తీర్చడానికి తీసుకువస్తారని టాక్‌. ఇక శృంగారం కూడా విచ్చలవిడిగా ఉంటుంది.. రకరకాల థీమ్స్‌ పేరుతో గ్రూపులుగా డివైడ్‌ అయ్యి.. విచ్చలవిడిగా ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే పార్టీకి వచ్చే వారికి ముందుగానే వీటి గురించి పూర్తిగా చెప్తారట. ఒక్కసారి పార్టీకి వచ్చాక.. దేనికి నో చెప్పకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అడ్డమైన గలీజు పనులకు రేవ్‌ పార్టీ అడ్డా అంటున్నారు. మరి ఇంత జుగుప్సకరమైన పార్టీలు సెలబ్రిటీలు హాజరవ్వడం సంచలనంగా మారింది.

Show comments