TS Governor-Rs 2 Lakh Rythu Runa Mafi: రైతులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. 2 లక్షల రుణమాఫీకి సర్వం సిద్ధం..

రైతులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. 2 లక్షల రుణమాఫీకి సర్వం సిద్ధం..

Rs 2 Lakh Rythu Runa Mafi: గణతంత్రి దినోత్సవ వేళ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నదాతలకు శుభవార్త చెప్పారు. రైతు రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

Rs 2 Lakh Rythu Runa Mafi: గణతంత్రి దినోత్సవ వేళ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నదాతలకు శుభవార్త చెప్పారు. రైతు రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేవంత్‌ సర్కార్‌ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. వారు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. రుణమాఫీకి సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హమీని నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ మేరకు  తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కీలక ప్రకటన చేశారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సర్వం సిద్దం అయ్యిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఆమె.. అనంతరం తన ప్రసంగాన్ని చదివి వినిపించారు.

తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న రూ.2 లక్షల రుణమాఫీపై గవర్నర్‌ తమిళిసై కీలక ప్రకటన చేశారు. గతణంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. అనంతరం ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల వేళ రూ.2 లక్షల రుణమాఫీపై ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతుందని చెప్పుకొచ్చారు గవర్నర్‌. ఒక పద్ధతి ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందన్నారు.

అంతేకాక అన్నదాతలకు పంట పెట్టుబడి సాయం అందిచడం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయడానికి సర్కార్‌ కసరత్తు చేస్తోందని తమిళిసై తెలిపారు. ఇప్పటికే చిన్న, సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ అయ్యాయని.. మరికొన్ని రోజుల్లో మిగిలిన రైతులకు రైతు భరోసా డబ్బులు అందుతాయని వెల్లడించారు. వరంగల్ డిక్లరేషన్‌లో రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని మరోసారి గవర్నర్ స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలకు కట్టుబడి ఉంది. వాటి అమలు కోసం ఇప్పటికే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం వీటికి సంబంధించి డేటా ఎంట్రీ ప్రాసెస్‌ జరుగుతోంది. అంతేకాక రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించారు. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మిగతా హామీలను కూడా అమలు చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

Show comments