తెలంగాణ మహిళలకు శుభవార్త.. ఒక్కొక్కరి నెలకు రూ.2500!

తెలంగాణ మహిళలకు శుభవార్త.. ఒక్కొక్కరి నెలకు రూ.2500!

తెలంగాణ ప్రభుత్వం తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ ప్రజలకు చెబుతూనే ఉంది. ఇటీవలే రైతులకు, కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూసే వారికి శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..తాజాగా మహిళలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ ప్రభుత్వం తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ ప్రజలకు చెబుతూనే ఉంది. ఇటీవలే రైతులకు, కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూసే వారికి శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..తాజాగా మహిళలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తుంది. ఆరు గ్యారెంటీలతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లింది. అలానే అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను రేవంత్ సర్కార్ అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు, మహిళలకు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఒక్కొక్కరికి నెలకు రూ.2500 ఇచ్చే విషయంపై కీలక విషయాన్ని తెలిపింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ ప్రభుత్వ  ఆరు గ్యారెంటీల్లో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు మహిళలకు పెద్ద పీట వేస్తుంది. మహలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వంటి స్కీమ్స్ ను అమలు చేస్తుంది. అలానే రైతులకు అందించే రైతు బంధు విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రులు తరచూ పలు అంశాలకు సంబంధించి కీలక ప్రకటన చేస్తుంటారు. తాజాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పర్యటించిన  మంత్రి పొన్నం మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఒక్కొక మహిళలకు రూ. 2500 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం సహా.. ఫ్రీ కరెంట్, రూ.500 గ్యాస్ సిలండర్ అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలో మహిళలకు  రూ.2500 ఇస్తామాని ఆయన వెల్లడించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతుంది. ఈ తక్కువ సమయంలోనే అనేక అద్భుత పథకాలను ప్రజలకు అందిస్తున్నాము. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు. అలానే రూ.500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన ఎవరికైనా రాకపోతే అధికారులకు చెప్పాలని ఆయన సూచించారు. లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇస్తామని ఆయన  స్పష్టం చేశారు. ఇప్పుడున్న పెన్షన్లు 4 వేలకు పెంచుతామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రూ. 2500 ఇస్తాం.’ అని మంత్రి పొన్నం వెల్లడించారు. మరి.. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments