Kota Student: ‘ఐదేళ్ల వరకు ఇంటికి రాను.. ఏడాదికోసారి ఫోన్‌ చేస్తా’ కోటాలో విద్యార్ధి మిస్సింగ్‌!

‘ఐదేళ్ల వరకు ఇంటికి రాను.. ఏడాదికోసారి ఫోన్‌ చేస్తా’ కోటాలో విద్యార్ధి మిస్సింగ్‌!

Kota Student: బిడ్డల చదువుల కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. రేయింబవళ్లు కష్టపడి బిడ్డలను చదివిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు చదువు ఒత్తిడి తట్టుకోలేక దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Kota Student: బిడ్డల చదువుల కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. రేయింబవళ్లు కష్టపడి బిడ్డలను చదివిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు చదువు ఒత్తిడి తట్టుకోలేక దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రతి తల్లిదండ్రులకు తమ బిడ్డలపై ఎన్నో ఆశలు ఉంటాయి. వారు బాగా చదువుకుని ఉన్నత స్థితికి  చేరుకోవాలని అందరూ భావిస్తుంటారు. బిడ్డల చదువుల కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. రేయింబవళ్లు కష్టపడి బిడ్డలను చదివిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు చదువు ఒత్తిడి తట్టుకోలేక దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే, మరికొందరు ఇళ్ల నుంచి, విద్యాసంస్థల నుంచి పారిపోతున్నారు. తాజాగా ఓ విద్యార్థి తన తండ్రికి  మేసేజ్ చేసి.. కనిపించకుండా పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడు రాసిన మేసేజ్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యార్థి మిస్సింగ్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రాజస్థాన్ లోని కోటా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతో మంది నీట్ కోచింగ్ కోసం ఇక్కడికి వస్తుంటారు. అలానే ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉండాలని ఎన్నో ఆశలతో తమ పిల్లలను కోచింగ్‌ హబ్‌గా పేరు గాంచిన ఈ కోటాకు పంపిస్తున్నారు. తరచూ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలతో కోటా తరచూ వార్తల్లో నిలుస్తోంది. కోటాలో వివిధ కోచింగ్ సెంటర్లలో క్లాస్‌లకు హాజరవుతున్న విద్యార్ధులు చదువుల ఒత్తిడి తట్టుకోలేక.. అటు ఇంటికి వెళ్లలేక.. జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇప్పటికే కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు, అదృశ్యాలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తాజాగా అక్కడ చదువుతోన్న మరో విద్యార్థి మిస్సింగ్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాను ఏకంగా ఐదేళ్ల పాటు  ఇంటి రానంటూ తల్లిదండ్రులకు మెసేజ్‌ చేశాడు.

రాజస్థాన్ లోని గంగారాంపూర్‌లోని బమన్‌శాస్‌కు చెందిన రాజేంద్ర మీనా (19) అనే విద్యార్ధి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మెడికల్‌ ప్రవేశ పరీక్ష ‘నీట్‌’కు ప్రిపేర్ అయ్యేందుకు కోటా వెళ్లాడు. కొంతకాలం నుంచి అక్కడే ఉంటూ నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతోన్నాడు. స్థానికంగా ఉన్న ఓ వసతి గృహంలో ఉంటూ శిక్షణ తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో మే 6వ తేదీన అతడు కనిపించకుండా పోయాడు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో సరిగ్గా 1.30 గంటలకు కోటాలో తాను ఉంటున్న హాస్టల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయాడు. అలా అక్కడి నుంచి  వెళ్లే కాసేపు ముందు.. రాజేంద్ర మీనా తన తండ్రి జగదీశ్‌ ఫోన్‌లో ఓ మెసేజ్‌ చేశాడు. తాను ఐదేళ్ల పాటు ఇంటి నుంచి దూరంగా ఉంటానని, చదువును కొనసాగించాలని అనుకోవడం లేదని తెలిపాడు.

అంతేకాక ఇప్పుడు తన  వద్ద రూ.8 000 ఉన్నాయని,  అవి ఐదేళ్లకు సరిపోతాయని తెలిపాడు.  ఇంక తన ఫోన్  కూడా అమ్మేస్తున్నానని చెప్పుకొచ్చాడు. తన గురించి ఎక్కువ చిత్తించవద్దని అమ్మకు చెప్పండని తెలిపాడు. తాను ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోనని తన తండ్రికి మేసేజ్ చేశాడు. అవసరమైతే తప్పకుండా ఏడాదికి ఒకసారి కచ్చితంగా ఫోన్‌ చేస్తానని తండ్రికి మెసేజ్‌ పంపాడు. ఇక కుమారుడు చేసిన మేసేజ్ చూసి.. రాజేంద్ర తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడి మిస్సింగ్ గురించి పోలీసులకు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్ధి అచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Show comments