Weekend Reminder: OTT లోకి ఏకంగా ఈ ఒక్కరోజే 14 సినిమాలు.. ఆ 2 మాత్రం చాలా స్పెషల్..

Weekend Reminder: OTT లోకి ఏకంగా ఈ ఒక్కరోజే 14 సినిమాలు.. ఆ 2 మాత్రం చాలా స్పెషల్..

శుక్రవారం వచ్చేసింది... ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు అంతగా ఏమి లేవు కాబట్టి.. మూవీ లవర్స్ అంతా కూడా ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయా అనే సెర్చింగ్ లో ఉంటారు. మరి వారందరి కోసమే ఈ సినిమాల జాబితా...

శుక్రవారం వచ్చేసింది... ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు అంతగా ఏమి లేవు కాబట్టి.. మూవీ లవర్స్ అంతా కూడా ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయా అనే సెర్చింగ్ లో ఉంటారు. మరి వారందరి కోసమే ఈ సినిమాల జాబితా...

ఎప్పటిలానే మరొక శుక్రవారం వచ్చేసింది. ఇలా ఎన్నో శుక్రవారాలు వచ్చినా కానీ.. మూవీ లవర్స్ కు మాత్రం ప్రతి శుక్రవారం కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే.. ప్రతి వారం ఓటీటీ లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి ఈ వారం థియేటర్ లో ఎలాగూ చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి.. మూవీ లవర్స్ అంతా కూడా.. ఓటీటీ లో కొత్తగా ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. మరి వారి కోసం ఈ వారం సినిమాలు, వెబ్ సిరీస్ లు అన్నీ కలుపుకుని కేవలం ఈ ఒక్కరోజే ఏకంగా 14 స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీ లో దాదాపు 21 కి పైగానే సినిమాలు, సిరీస్ లు విడుదల అవుతుండగా.. ఈ ఒక్కరోజే 14 సినిమాలు స్ట్రీమింగ్ కానుండడం విశేషం. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు రెడీగ ఉన్న సినిమాలు, సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

నెట్ ఫ్లిక్స్:

  • లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 10
  • బ్లడ్ ఆఫ్ జీసస్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- మే 10
  • కుకింగ్ ఆప్ మర్డర్: అన్‌కవరింగ్ ది స్టోరీ ఆఫ్ సీజర్ రోమన్ (డాక్యుమెంట్ సిరీస్)- మే 10
  • ది అల్టిమేటమ్: సౌతాఫ్రికా (రియాలిటీ షో)- మే 10

జీ5 :

  • 8 ఏఎమ్ మెట్రో (హిందీ చిత్రం)- మే10
  • పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్)- మే 10

జియో సినిమా:

  • మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ వెబ్ సిరీస్)- మే 10
  • ప్రెట్టీ లిటిల్ లయర్స్: సమ్మర్ స్కూల్ – మే 10

ఆహ:

  • రోమియో (తమిళ సినిమా)- మే 10

సోనీ లివ్:

  • అన్‌దేకి సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- మే 10

లయన్స్ గేట్ ప్లే:

  • ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) – మే 10

సన్ నెక్ట్స్ :

  • ఫ్యూచర్ పొండాటి (తమిళ వెబ్ సిరీస్) – మే 10

హుళు:

  • బయోస్పియర్- మే 10

హోయ్‌చోయ్:

  • చాల్చిత్ర ఏఖాన్- మే 10

ఇక ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఓటీటీ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఆవేశం, గీతాంజలి మళ్ళీ వచ్చింది.. చిత్రాలు ప్రేక్షకులను మెప్పిస్తునే ఉన్నాయి. ఈ సినిమాలను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. ఇక ఈరోజు రిలీజ్ అవ్వబొయె సినిమాలు, సిరీస్ లలో మర్డర్ ఇన్ మహిమ్, రోమియో చిత్రాలకు బాగానే బజ్ నడుస్తుంది. మరి ఈ సినిమాలు ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటాయి వేచి చూడాలి. మరి ఈ వారం ఓటీటీ లోకి రానున్న ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments