హృదయ విదారకం.. తల్లిని కాపాడండి అంటూ నాలుగేళ్ల కొడుకు రోదన

హృదయ విదారకం.. తల్లిని కాపాడండి అంటూ నాలుగేళ్ల కొడుకు రోదన

బుధవారం శ్రీరామ నవమి పండుగ కావడంతో పుట్టింటి నుండి వచ్చిన మౌనిక.. అత్తారింట్లో పనులు మొదలు పెట్టింది. ఇల్లు, దుస్తులు శుభ్రం చేసుకుందామని చూస్తే.. నీళ్లు రావడం లేదు. ఏమైందా అని

బుధవారం శ్రీరామ నవమి పండుగ కావడంతో పుట్టింటి నుండి వచ్చిన మౌనిక.. అత్తారింట్లో పనులు మొదలు పెట్టింది. ఇల్లు, దుస్తులు శుభ్రం చేసుకుందామని చూస్తే.. నీళ్లు రావడం లేదు. ఏమైందా అని

ఏ తల్లి బిడ్డను ఒంటరి చేసి వెళ్లిపోవాలని అనుకోదు. అందులోనూ ముక్కు పచ్చలారని చిన్న పిల్లల్ని, లోక జ్ఞానం ఎరుగని పసికూనల్ని విడిచి పెట్టాలని ఆలోచన కూడా దరి చేరనీయదు. కాసేపు బిడ్డ కనబడకపోతే అల్లాల్లాడిపోతుంది. అదే పేగు బంధం. కానీ ఊహించని పరిణామాలే తల్లిని బిడ్డను వేరు చేస్తాయి.  ఇదే జరిగింది గౌతమ్ విషయంలో. తల్లి కుమారుడ్ని వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆలనా, పాలనా చూసుకుని మురిసిపోవాలనుకున్న అమ్మ అచేతనంగా పడి ఉంటే.. ఆమె నిద్రపోతుందని భావించే బిడ్డకి తండ్రి ఏం చెబుతాడు. మనల్ని వదిలి వెళ్లిపోయింది.. ఇక తిరిగి రాదని చెప్పినా అర్థం కాని వయస్సు అతడిది.  అలా అమ్మ ముఖాన్ని  చూస్తుండటం తప్ప.

శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకుని ఇల్లు శుభ్రం చేసుకుంటున్న మహిళ.. ట్యాంకులో నీరు రావడం లేదని నిచ్చెన సహాయంతో రేకులపైకి ఎక్కింది. అంతలో విద్యుదాఘాతానికి గురై రేకులపై పడి మరణించింది. ఎంతకు తల్లి కిందకు దిగి రాకపోవడంతో పక్కనే ఉన్న బిల్డింగ్ ఎక్కి నాలుగేళ్ల కుమారుడు చూడగా.. రేకులపై అచేతనంగా పడి ఉంది. ‘అమ్మ.. అమ్మా’ అని స్పందించినా లేవకపోవడంతో వెంటనే అక్కడే ఉన్న పెద్దనాన్నకు విషయం చెప్పాడు. వారు వెళ్లి చూడగా.. ఆమె చనిపోయింది. ఏం జరిగిందో తెలియక.. అమ్మను కాపాడండి అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు ఆమె కొడుకు. అతడి వేదన చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు స్థానికులు. ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లా.. కాశిపేటలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కోమటి చేను గ్రామానికి చెందిన మౌనిక, రాజేశ్ దంపతులు. వీరికి నాలుగేళ్ల కుమారుడు గౌతమ్ ఉన్నాడు.  రెండేళ్ల క్రితం మౌనిక తల్లి చనిపోగా.. బుధవారం శ్రీరామ నవమి పండుగ కావడంతో ముత్యం పల్లిలోని తల్లి ఇంటికి వెళ్లి.. ఇంటి పనులు చక్కబెట్టుకుంది. పండుగ నాడు మౌనికను తండ్రి తన అత్త ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. శ్రీరామ నవమి కావడంతో ఇల్లు, బట్టలు శుభ్రం చేసే పనిలో బిజీగా ఉంది మౌనిక. అయితే ట్యాంకు నుండి నీరు రావట్లేదు. ఏం అయ్యిందా అని రేకులపై ఉన్న ట్యాంక్‌ను పరిశీలించేందుకు నిచ్చెన సాయంతో పైకిఎక్కింది. అయితే ఇంట్లోకి వచ్చే తీగ తెగి రేకులపై పడింది. రేకులకు విద్యుత్ సరఫరా అయ్యింది.

ఈ విషయం గమనించని మౌనిక.. రేకులపై అడుగుపెట్టేసరికి ఒక్కసారిగా షాక్‌కు గురై రేకులపై పడిపోయింది. ఇంటిపైకి వెళ్లిన తల్లి ఎంతకు రాకపోవడంతో.. పక్క భవనంలో నుండి చూశాడు కొడుకు. రేకులపై ఆమె పడిపోయి ఉండగా.. అరిచినా స్పందన లేకపోవడంతో వెంటనే పెద్దనాన్నకు విషయం చెప్పాడు. అతడూ రేకులపై వెళ్లగానే షాక్ కొట్టింది. ఇది గమనించిన వెంటనే కరెంట్ సరఫరా నిలిపి వేయడంతో ప్రాణా పాయం తప్పింది. ఆమెను కిందికు దించి.. 108కి కాల్ చేయగా.. సిబ్బంది వచ్చి మరణించినట్లు వెల్లడించారు. తల్లి స్పృహ తప్పి పడిపోయింది అనుకుని.. ఆమె కొడుకు గౌతమ్.. తన తల్లిని కాపాడాలని 108 సిబ్బందిని వేడుకున్నాడు. గౌతమ్ తాపత్రయం చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే అత్త ఇంటి వద్ద వదిలి వెళ్లిన తండ్రికి.. కూతురు చనిపోయిందని వార్త రాగానే.. బిగ్గరగా ఏడ్చుకుంటూ వచ్చాడు.

Show comments