ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ చివరకు నడి రోడ్డుపై భర్త చేసిన పనికి

ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ చివరకు నడి రోడ్డుపై భర్త చేసిన పనికి

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా రత్నల్లాంటి పిల్లలు పుట్టారు. హాయిగా సాగిపోతున్న సంసారంలో ఒక్కసారిగా కుదుపు. చివరకు అది ఎంతటి పరిణామాలకు దారి తీసిందంటే...?

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా రత్నల్లాంటి పిల్లలు పుట్టారు. హాయిగా సాగిపోతున్న సంసారంలో ఒక్కసారిగా కుదుపు. చివరకు అది ఎంతటి పరిణామాలకు దారి తీసిందంటే...?

భార్యా భర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు సంసార బంధాన్ని విచ్చిన్నం చేస్తున్నాయి. పెద్దలు చేసినా పెళ్లైనా, ప్రేమ వివాహాలైనా సరే దంపలిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఇంటిని కురుక్షేత్రం చేసుకుంటున్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ, పిల్లల ముందు కొట్టాడుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు నడి రోడ్డుపైకి సంసారాన్ని లాక్కొని పరువును బజారున వేసుకుంటున్నారు. అక్కడితో ఆగి పోవడం లేదు. చివరకు పిల్లల్ని తల్లి లేదా తండ్రి లేని అనాథలను చేస్తున్నారు. భార్యా భర్తల మధ్య తగాదా కారణంగా భార్యపై కక్షను పెంచుకున్న భర్త నడి రోడ్డుపై భార్యను హత్య చేశాడు. ఈ ఘటన కేరళలోని అలపుజ్జాలో చోటుచేసుకుంది.

అలపుజ్జాలోని చేర్టాలలోని పల్లిపురంలో జీవిస్తున్నారు భార్య భర్తలు రాజేష్, అంబిలి. వీరిది లవ్ మ్యారేజ్.వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా రాజలక్ష్మి, రాహుల్ పిల్లలు జన్మించారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్లస్ 2, పదో తరగతి చదువుతున్నారు. కొన్ని సంవత్సరాలు వీరి కాపురం హాయిగా సాగిపోయింది. ఈ అందమైన కాపురంలోకి కలతలు మొదలయ్యాయి.  పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేష్ జల రవాణా శాఖలో పని చేస్తున్నారు. అంబిలి తిరునల్లూరు సర్వీస్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో కలెక్షన్ ఏజెంట్‌గా వర్క్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా ఉంది వ్యవహారం. దీంతో భార్యపై కోపాన్ని పెంచుకున్నాడు రాజేష్. శనివారం  విధుల్లో భాగంగా పలు దుకాణాల్లో డబ్బులు వసూలు చేసేందుకు అంబిలి స్కూటర్‌పై పల్లిచంట ప్రాంతానికి వచ్చింది.

ఆ సమయంలో భార్యను వెంటాడుతూ వచ్చిన భర్త రాజేష్..తన వెంట తెచ్చుకున్న కత్తితో నడిరోడ్డుపై భార్య అంబిలిని పొడిచాడు. రోడ్డుపై రక్తమోడుతూ ఉన్న ఆమెను స్థానికులు వాహనంలో చేర్టాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడు రాజేష్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని కంజికుజిలా బార్ సమీపంలో పట్టుకున్నారు పోలీసులు. స్థానికులను విచారించగా.. వీరిద్దరూ నిత్యం గొడవ పడేవారని, ఇటీవల పెద్ద గొడవ జరగ్గా.. అంబిలి ఇంటి అద్దాలు కూడా పగులగొట్టాడని చెబుతున్నారు. ఇప్పుడు ఆమెను నడి రోడ్డుపై చంపి తన కక్ష తీర్చుకున్నాడు రాజేష్. ఇప్పుడు పిల్లలు తల్లి లేని అనాథలుగా.. తండ్రి ఉన్నా లేని వారిగా మారిపోయారు.

Show comments