CSK vs RCB- Dhoni Quietly Walked Off: వీడియో: మ్యాచ్ తర్వాత RCBని అవమానించిన ధోనీ.. ఇలా చేశాడేంటి?

వీడియో: మ్యాచ్ తర్వాత RCBని అవమానించిన ధోనీ.. ఇలా చేశాడేంటి?

CSK vs RCB- Dhoni Walked Off: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో చెన్నై- ఆర్సీబీ మధ్య మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను పంచింది. కానీ, మ్యాచ్ తర్వాత ధోనీ చేసిన పనికి అంతా షాకయ్యారు. అసలు ఏం జరిగిందంటే?

CSK vs RCB- Dhoni Walked Off: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో చెన్నై- ఆర్సీబీ మధ్య మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను పంచింది. కానీ, మ్యాచ్ తర్వాత ధోనీ చేసిన పనికి అంతా షాకయ్యారు. అసలు ఏం జరిగిందంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో మర్చిపోలేని మ్యాచ్ జరిగింది. చిన్నస్వామి స్టేడియంలో చెన్నై- ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ చిరకాలం గుర్తుండిపోయే మజాని అందించింది. టేబుల్ లీస్ట్ లో ఉన్న జట్టు ప్లే ఆఫ్స్ కు వచ్చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించి ప్లే ఆఫ్స్ కు రాకుండా అడ్డుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల ఆశల మీద ఆర్సీబీ నీళ్లు జల్లింది. మరోవైపు ఆర్సీబీ పోరాటాన్ని చూసి అభిమానులు కూడా మెచ్చుకుంటున్నారు. తమ అభిమాన జట్టు వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా కప్పుకొట్టాలి అంటూ కోరుకుంటున్నారు. అయితే ఆర్సీబీ గెలిచిన తర్వాత ధోనీ చేసిన పనికి మాత్రం ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ప్రతి బాల్ నరాసు తెగే ఉత్కంఠను పంచింది. ఈ మ్యాచ్ చూసిన ఆడియన్స్ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ- అనుష్క దంపతులు అయితే ఏడ్చేశారు. ఆర్సీబీ టీమ్ మొత్తం మైదానంలో పరుగులు పెడుతూ సంబరాలు చేసుకున్నారు. ప్లే ఆఫ్స్ కి రావడం వారికి ఫైనల్ గెలిచినంత సంబరాన్ని అందించింది. ఫ్యాన్స్ కూడా మైదానంలోనే ఎంతో ఎమోషనల్ అయిపోయారు. అయితే ఈ మ్యాచ్ లో ధోనీ తీరుపై ఇప్పుడు నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్సీబీ టీమ్ ని ధోనీ అవమానించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

విషయం ఏంటంటే.. ఆర్సీబీ గెలిచిన తర్వాత ధోనీ ఎంతో బాధగా కనిపించాడు. ప్లేయర్లతో పాటు మైదానంలోకి వచ్చాడు. కానీ, ఆర్సీబీ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. గ్రౌండ్ లోకి వస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ కి మాత్రం షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించాడు. కానీ, ఆటగాళ్లను మాత్రం అభినందించలేదు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ ధోనీ తమ ఆటగాళ్లను అవమానించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు అలా వెళ్లిపోయాడు అని ప్రశ్నిస్తున్నారు. ఇది కావాలనే చేశాడు అంటూ ఇంకొంత కామెంట్స్ చేస్తున్నారు.

ఇక్కడ ఇంకో వర్షన్ కూడా వినిపిస్తోంది. కొందరు ఎంఎస్ ధోనీ అలా వెళ్లిపోవడానికి కారణం లేకపోలేదు అంటూ వివరణ ఇస్తున్నారు. ఎందుకంటే ధోనీకి వెన్నునొప్పి వచ్చిందని.. అందుకే నిల్చోలేక మైదానం నుంచి వెళ్లిపోయాడు అంటూ సమర్థిస్తున్నారు. కావాలని చేస్తే సపోర్టింగ్ స్టాఫ్ ని కూడా పట్టింతుకోకుండా వెళ్లిపోతాడు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. శరీరం సహకరించకనే అలా వెళ్లిపోయాడు అంటున్నారు. అయితే ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం అని చెప్పే అవకాశం లేదు. దానికి ధోనీ స్వయంగా వివరణ ఇస్తేనే అసలు విషయం తెలుస్తుంది. ధోనీ ఆర్సీబీని అవమానించాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments