దేవుడు చల్లగా చూసినా.. కనికరించని వైద్యులు! పాపం ఈ తల్లి!

దేవుడు చల్లగా చూసినా.. కనికరించని వైద్యులు! పాపం ఈ తల్లి!

అమ్మ అనే పిలుపు కోసం ప్రతి స్త్రీ వెయిట్ చేస్తుంది. గర్భం దాల్చిన దగ్గర నుండి.. బిడ్డ పుట్టే వరకు జాగ్రత్తలు తీసుకుంటుంది. తన కన్నా.. తన కడుపులో ఉన్న తన ప్రతి రూపం కోసం ఎన్నో కలలు కంటుంది. కానీ ఈ మహిళకు మాత్రం

అమ్మ అనే పిలుపు కోసం ప్రతి స్త్రీ వెయిట్ చేస్తుంది. గర్భం దాల్చిన దగ్గర నుండి.. బిడ్డ పుట్టే వరకు జాగ్రత్తలు తీసుకుంటుంది. తన కన్నా.. తన కడుపులో ఉన్న తన ప్రతి రూపం కోసం ఎన్నో కలలు కంటుంది. కానీ ఈ మహిళకు మాత్రం

మాతృత్వం అనేది వరంగా భావిస్తుంది మహిళ. ప్రతి మహిళ సంపూర్ణ స్త్రీగా మారాలని కోరుకుంటుంది. ఓ బిడ్డకు తల్లిని కావాలని పరితపించిపోతుంటుంది. తనకు కాన్పు మరో జన్మ అని తెలిసి కూడా బిడ్డను కనేందుకు సిద్ధం అవుతుంది పెళ్లైన పడతి. పెళ్లైన సంవత్సరానికే ఏదైనా విశేషం ఉందా.. శుభవార్త ఎప్పుడు చెబుతున్నావంటూ పేరెంట్స్, అత్తా మామలే కాకుండా ఇరుగు పొరుగు కూడా ప్రశ్నిస్తుంటారు. ఇక మూడేళ్లయినా పిల్లలు లేకపోతే గోడ్రాలు అన్న నిందలు వేస్తుంటారు. ఇలాంటి నిందలు కన్నా.. అమ్మ అవ్వాలని, ఆ పిలుపు కోసం తహతహలాడుతుంది మహిళ. కానీ ఆ పిలుపును వినకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. దేవుడు కనికరించినా.. కరుణ చూపలేదు వైద్యులు.

తల్లిని కాబోతున్నానన్న ఆనందం.. అలాగే డెలివరీ సమయం దగ్గర పడుతుందన్న ఆందోళన.. అంతలో పురిటి నొప్పులు, ఇంకొన్ని గంటల్లో బిడ్డను తన చేతిలోకి తీసుకుంటానని మురిసిపోయింది. కానీ ఆ సంతోషాన్ని చవి చూడకుండానే కన్నుమూసింది.  వైద్యుల నిర్లక్ష్యానికి బలైంది ఓ ఇల్లాలు. ఈ  ఘటన మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుప్రతిలో చోటుచేసుకుంది. దీనికి ఆసుపత్రి నిర్లక్ష్యం అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్, రవళిక భార్యా భర్తలు. ఇటీవల రవళిక గర్భం దాల్చింది. రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉంది. సోమవారం డెలివరీ డేట్ ఇవ్వడంతో.. ప్రసవం నిమిత్తం ఆసుపత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ కావడంతో బాబుకు జన్మనిచ్చింది. కానీ ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్త స్రావం అయ్యింది.

వెంటనే ఆసుపత్రి సిబ్బంది రక్తం కావాలని.. కుటుంబ సభ్యులకు తెలిపారు. భర్త వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చేలోగా రవళికకు చికిత్స అందించిన నందిని.. ఆమె కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మరో ఆసుపత్రికి తరలించింది. సమీపంలోని మెడి లైఫ్‌కు రవళికను పంపగా.. చికిత్స పొందుతూ మరణించింది. బిడ్డను చూడకుండానే తల్లి కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయింది. కాగా, రవళిక చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ఆమె బంధువులు.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్ నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించి.. ఆందోళన విరమించేలా చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పుట్టిన బిడ్డను కన్నులారా అయిన తిలకించకుండా కాటికి చేరిందో తల్లి.

Show comments