3 ఏళ్లు పెద్దదైన అమ్మాయితో ప్రేమ.. హోటల్ రూంకి తీసుకెళ్లి 2 రోజులు ఎంజాయ్.. తీరా

3 ఏళ్లు పెద్దదైన అమ్మాయితో ప్రేమ.. హోటల్ రూంకి తీసుకెళ్లి 2 రోజులు ఎంజాయ్.. తీరా

అబ్బాయి కన్నా అమ్మాయి మూడేళ్లు పెద్దది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇటీవల ఓ చల్లని ప్రాంతానికి వెళ్లి.. హోటల్ రూం తీసుకుని ఎంజాయ్ చేశారు. తీరా చెక్ అవుట్ చేస్తుండగా..

అబ్బాయి కన్నా అమ్మాయి మూడేళ్లు పెద్దది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇటీవల ఓ చల్లని ప్రాంతానికి వెళ్లి.. హోటల్ రూం తీసుకుని ఎంజాయ్ చేశారు. తీరా చెక్ అవుట్ చేస్తుండగా..

ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడమే కాకుండా.. చిన్న వయస్సులోనే ఇల్లు, కారు, బంగారం వంటి ఆస్తి పాస్తులను సంపాదించుకోగలుతున్నారు. అయినప్పటికీ కూడా కొందరు అమ్మాయిలు ప్రేమ ముసుగులో పడి.. కెరీర్ మాత్రమే కాదు.. తమను తాము నాశనం చేసుకుంటున్నారు. ప్రియుడు రమ్మనడం ఆలస్యం..వెనకా ముందు ఆలోచించకుండా చెప్పిన ప్రాంతానికి వెళుతున్నారు. ఇదే వారి కొంపలకు తిప్పలు తెచ్చిపెడుతుంది. తాజాగా ఓ యువతి తన లవ్వర్ రమ్మన్నాడని హోటల్ రూంకి వెళ్లింది. ఇద్దరూ కలిసి రెండు రోజుల పాటు ఎంజాయ్ చేశారు. అయితే రెండు రోజుల తర్వాత అతడు ఒక్కడే హోటల్ చెక్ అవుట్ చేస్తుంటే అనుమానం వచ్చిన  సిబ్బందికి కళ్ల ముందు కనిపించిన దృశ్యం చూసి అవాక్కవ్వడం వారి వంతైంది.

ప్రియురాలితో రెండు రోజులు హోటల్లో గడిపి.. ఆపై హత్య చేసి.. మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి తీసుకెళుతుండగా సిబ్బందికి పట్టుబడ్డాడు నిందితడు. వివరాల్లోకి వెళితే హర్యానాలోని పల్వాల్‌కు చెందిన వినోద్ (23), తన కన్నా మూడేళ్లు పెద్దైన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ ప్రాంతానికి చెందిన శీతల్ కౌసలి (26)ని ప్రేమించాడు. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఇద్దరు కలిసి మే 13న హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో గొంపా రోడ్డులోని ఓ లగ్జరీ హోటల్‌కు వెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు గది బుక్ చేసుకున్నారు. అక్కడే ఉంటూ ఎంజాయ్ చేశారు. మే 15న రాత్రి వినోద్ మాత్రమే చెక్ అవుట్ కోసం రిసెప్షన్ వద్దకు వచ్చాడు. అక్కడ సిబ్బంది ఆ అమ్మాయి ఏదీ అని అడిగితే.. లేహ్ వెళ్లిందని చెప్పాడు. అయితే అతడి చేతిలో ఉన్న సూట్ కేసు పై దృష్టి పడింది.

అంతలో వినోద్ వెళ్లేందుకు కారు టాక్సీ బుక్ చేశాడు. ఆ డ్రైవర్.. సూట్ కేస్ బరువుగా ఉండటంతో అనుమానం వచ్చి అతడిని ప్రశ్నించాడు. దీంతో అతడు నీళ్లు నమలడం మొదలు పెట్టాడు. అనుమానం వచ్చిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వినోద్ సూట్ కేస్ అక్కడే వదిలేసి.. పరారయ్యాడు. పోలీసులు వచ్చి.. సూట్ కేస్ తెరిచి చూడగా శీతల్ మృతదేహం కనిపించింది. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మనాలి నుండి బస్సులో తప్పించుకుంటున్న వినోద్ ను పట్టుకున్నారు పోలీసులు. అయితే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రియురాల్ని హత్య చేసి సూట్ కేసులో పెట్టానని చెప్పాడు నిందితుడు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి నిర్జన ప్రదేశంలో వదిలేయాలని అనుకున్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Show comments