వీడియో: మల్లెపూలు కొని అలంకరించుకుంటున్నారా.. డేంజర్లో పడ్డట్టే!

మల్లెపూలు ఇష్టపడని మగువ ఉండదు. వాసనతో దాంప్యత జీవితంలోని శృంగారానికి తోడ్పాటునందిస్తుంటాయి పూలు. కానీ ఈ పూలు కొనుగోలు చేస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. అయితే ఈ వీడియోను చూడండి.

మల్లెపూలు ఇష్టపడని మగువ ఉండదు. వాసనతో దాంప్యత జీవితంలోని శృంగారానికి తోడ్పాటునందిస్తుంటాయి పూలు. కానీ ఈ పూలు కొనుగోలు చేస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. అయితే ఈ వీడియోను చూడండి.

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు తయారయ్యింది నేడు. ప్రతి వస్తువు, పదార్ధాల్లో నకిలీ వచ్చి చేరుతుంది. మనకు తెలియకుండానే మనం మోసపోతున్నాం. బ్రాండెడ్ బట్టల నుండి ఇంట్లో వినియోగించే మిరియాలు, కారం, పసుపు వంటి పదార్థాలను పోలిన కల్తీ పదార్థాలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అసలు ఏదీ, ఫేక్ ఏదో తెలియకుండా పోతుంది. డబ్బే లక్ష్యంగా కొంత మంది మనుషుల జీవితాలతో వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు కూరగాయలు, పండ్లు కూడా నకిలీ అయిపోతున్నాయి. కలర్, స్వీట్స్ కోసం ఇంజక్షన్స్ ఇచ్చి.. మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాకి వచ్చి చేరాయి మగువలు ఎంతో ఇష్టపడే మల్లెపూలు.

సమ్మర్ వచ్చేసిందంటే చాలు.. చెట్టుకు విరగకాస్తుంటాయి మల్లెలు. వీటిని దండలుగా గుచ్చుకుని మహిళలు తలతో పెట్టుకుంటారు. కేవలం అందానికే కాదు.. భర్తలను ఆకర్షించేందుకు కూడా అలంకరించుకుంటారు. ఇక చిన్నపిల్లలకు కూడా పూల జడలు వేసి ముచ్చటపడుతుంటారు తల్లిదండ్రులు. చివరకు మల్లెపూలను సైతం నాశనం చేస్తున్నారు. మల్లెపూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అలాగే త్వరగా విచ్చిపోతాయి. దీంతో అమ్మకం దారులకు నష్టం వాటిల్లుతుంది. దీంతో నకిలీ బాట పట్టారు. మల్లెపూలు తాజాగా ఉండేందుకు, అలాగే పచ్చగా, బ్లూ కనిపించేందుకు రసాయనాలు ఉంచిన వాటర్‌లో ముంచి తేల్చుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో దండలుగా కట్టిన మల్లెపూలను ఓ ఐస్ బాత్‌లో కాపర్ సల్ఫైట్ కలిపిన నీళ్లల్లో ముంచి లేపుతున్నారు. దీని వల్ల పూలు కలర్ మారిపోవడంతో పాటు ప్రెష్‌గా ఉండనున్నాయి. వీటినే తాజా పూల పేరుతో మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు. కానీ ఇవేమీ తెలియని పురషులు, మహిళలు వాటిని కొనుగోలు చేసి అలరించుకుంటున్నారు. దీని వల్ల తలనొప్పి, చర్మ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యలు నెలకొంటున్నాయి. పూలు పచ్చగా ఉన్నాయి.. ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి అని కొనుక్కుంటే మీరు డేంజర్లో పడినట్లే.. మీ ఆరోగ్యాన్ని మీ చేతులతో నాశనం చేసుకున్నట్లే. మరీ ఎలా అనుకుంటున్నారా.? మల్లెలు ఎప్పుడు తెల్లగానే ఉంటాయి. అవి గ్రీన్, బ్లూ కలర్స్ లో ఉండవు కాబట్టి.. ఓ సారి చెక్ చేసుకుని కొనుక్కోవడం మంచిది.

Show comments