Hyderabad: HYD వాటర్ ట్యాంక్ భీభత్సం.. 3 ఏళ్ల చిన్నారి బలి

HYD వాటర్ ట్యాంక్ భీభత్సం.. 3 ఏళ్ల చిన్నారి బలి

రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వేగం, నిర్లక్ష్యం, నిద్రలేమి, మద్యం సేవించి బండి నడపడం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు.

రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వేగం, నిర్లక్ష్యం, నిద్రలేమి, మద్యం సేవించి బండి నడపడం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు.

అతివేగం నిండు ప్రాణాలను బలిగొంటుంది. ప్రాణంగా ప్రేమించే వ్యక్తులను రోడ్డు ప్రమాదాల మూలంగా కోల్పోవలసి వస్తుంది. ఇంటి కుటుంబ సభ్యుల్సి పొగొట్టుకోవలసి వస్తుంది. వాహనాలపై నియంత్రణ లేకపోవడం, మద్యం సేవించి నడపడం, నిర్లక్ష్యం, రాంగ్ రూట్, అతివేగం కారణంగా రహదారులు రక్తమోడుతున్నాయి. వీటి కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. లేక లేక పుట్టిన పిల్లల్ని తల్లిదండ్రులకు దూరం చేస్తున్నాయి. చేతి కొచ్చిన కొడుకుని తమ చేతులతోనే చితికి మంట పెట్టాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. భర్తను, తండ్రిని పోగొట్టుకుని.. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవలసి వస్తుంది. తాజాగా హైదరాబాద్ నగరంలో వాటర్ ట్యాంక్ సృష్టించిన భీభత్సానికి మూడేళ్ల చిన్నారి బలి అయ్యింది.

హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాటర్ ట్యాంకర్ భీభత్సం సృష్టించింది. ట్యాంకర్‌ను అతివేగంగా నడుపుకుంటూ తీసుకు వచ్చిన డ్రైవర్.. కారును ఢీ కొన్నాడు. దీంతో కారులో ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. కారును బలంగా ఢీ కొనడంతో.. ఆ వాహనంలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఉన్న ఈ చిన్నారి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. బాధితులను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన హిమాయత్ సాగర్ సర్వీసు రోడ్డులో జరిగినట్లు సమాచారం. కాగా, బాధితులు పాత బస్తీ వాసులుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు పోలీసులు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరింత విచారణ చేపడుతున్నారు.  వాహనదారుడి నిర్లక్ష్యం వల్ల మూడేళ్లకే చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో కన్నా.. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది.  రోడ్డుపై  వెళుతుంటే.. రయ్ రయ్ మంటూ వాహనాలు దూసుకెళ్లిపోతున్నాయి. అతివేగం ప్రమాదకరం అని తెలిసి కూడా కొంత మంది వాహనాలపై వేగంగా వెళుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రహదారి ప్రమాదాలు పెరగడం వెనుక కారణాలేంటో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తె లియజేయండి.

Show comments