CM Revanth: మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్న CM రేవంత్.. ఇక వారికి ఏడాదంతా పని

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతున్నారు. దీని వల్ల వారికి ఏడాదంతా పని లభించనుంది అంటున్నారు. ఆ వివరాలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతున్నారు. దీని వల్ల వారికి ఏడాదంతా పని లభించనుంది అంటున్నారు. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చే ప్రయత్నంలో ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో.. వినూత్న పథకాలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ మరో కొత్త పథకానికి శ్రీకారం చూట్టనున్నారు. దీని వల్ల వారికి ఏడాదంతా పని దొరుకుతుంది. ఇంతకు ఆ పథకం ఏంటి.. ఎవరికి లబ్ధి చేకూరనుంది అంటే.. ఆ వివరాలు..

సమాజంలో అన్నదాతల తర్వాత అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారిలో నేతన్నలు ఉంటారు. సరైన ఉపాధి లేక.. ఉత్పత్తి చేసిన వస్త్రాలకు ఆదరణ లేక.. అప్పుల పాలై.. మగ్గాలే ఉరి తాళ్లుగా మార్చుకుని ప్రాణాలు తీసుకున్న నేత కార్మికులు ఎందరో ఉన్నారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతన్నల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే సమస్యలు పూర్తిగా సమసిపోలేదు.

ఈ క్రమంలో ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెటిడెంట్ కేటీఆర్.. చేనేత కార్మికుల సమస్యలపై స్పందించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. నేతన్నలను ఆదుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని కేటీఆర్ కోరారు. అంతేకాక గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా పని ఉండేలా వారికి వెంటనే అర్డర్లు ఇవ్వాలని కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు. ఈక్రమంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నేత కార్మికుల కోసం త్వరలో కొత్తగా ‘నేతన్న భరోసా’ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. దీని వల్ల వారికి ఏడాదంతా పని లభించనుందని భావిస్తున్నారు.

చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల సంక్షేమం కోసం నూతన పథకాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ ఏర్పాటు, హ్యాండ్‌లూమ్‌ పార్కు పునరుద్ధరణ, కొత్త పవర్‌లూమ్‌ క్లస్టర్‌ల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు కొత్త సాంకేతిక వస్త్ర విధానాన్ని ఆవిష్కరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని చేనేత సంఘాలకు పని కల్పించే విధంగా చర్యలు చేపట్టిందని తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే రూ.53 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చారు. అలానే గతంలో చేనేత సహకార సంఘాలకు పెండింగ్‌లో ఉన్న రూ.8.81 కోట్ల బకాయిలను విడుదల చేసిందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

Show comments