Arjun Suravaram
khammam: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏమైనప్పటికీ.. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఈ ప్రమాదాలు జనాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
khammam: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏమైనప్పటికీ.. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఈ ప్రమాదాలు జనాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Arjun Suravaram
ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో మన మీదకి వస్తుందో చెప్పలేము. అయితే కొన్ని ప్రమాదాలు ప్రకృతి పరంగా జరిగితే, మరికొన్ని మాత్రం మానవ తప్పిదాల కారణంగానే జరుగుతుంటాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు చాలా వరకు మనిషి నిర్లక్ష్యం కారణంగానే చోటుచేసుకుంటాయి. అందుకే ఇటీవల కాలంలో ఎక్కడ విన్నా, చూసిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలే. ఈ ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యం మత్తు, అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతోనే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూసుమంచి మండలంలో ఈఘటన చోటుచేసుకుంది. కూసుమంచి మండలం లోక్యాతండా వద్ద సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. పూరి జగన్నాథ్ అనే ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యా తండా సమీపంలోని వంతెన వద్దకు రాగానే ఈ బస్సు ప్రమాదానికి గురైంది. లోక్యాతండా వంతెన వద్దకు వచ్చే సరికి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. శనివారం తెల్లవారు జాము సమయంలో జరిగిన ఈ ఘటన గురించి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ రోడ్డు ప్రమాదాంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. ఈ ఘటన తరహాలోనే నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఎంతో మంది అమాయలుకు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా కొందరు డ్రైవర్లు అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి..ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నింపుతున్నారు. మరి. ఇలాంటి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.