రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్! ఖాతాల్లోకి రూ.10 వేలు..

Good News for Farmers: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రైతుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Good News for Farmers: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రైతుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

గత ఏడాది చివరల్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు ఓటర్లను ప్రభావితం చేశాయి. దాంతో తెలంగాణ ప్రజలు  కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సీఎం గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత  సీఎం రేవంత్ రెడ్డి  పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు కృషి చేస్తున్నారు. అలాగే రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఈ క్రమంలోనే రైతులకు ఓ శుభవార్త తెలిపారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఇటీవల అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురియడంతో పంట నష్టం జరిగింది. భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగిపోవడంతో అన్నదాతలు కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతు ధైర్యంగా ఉండాలని.. నష్ట పరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చింది తెలంగాణ సర్కార్. పంట నష్టానికి గురైన రైతులకు నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.10 వేల ఇస్తామని ప్రకటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు మార్చి లో వ్యవసాయశాఖ నిర్ధారించింది.

ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. ఈ కారణంగా రైతులకు పంట నష్టాన్ని అందించలేక పోతున్నామని ఇటీవల ప్రకటించారు. అయితే ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. ఈ మేరకు అనుమతి కోరుతూ ఈసీకి ప్రభుత్వం లేఖ కూడా రాసింది. అయితే లేఖ పై స్పందించిన ఎలక్షన్ కమీషన్ పరిహారం పంపిణీకి అనుమతి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వచ్చే వారం నుంచి రైతుల ఖాతాల్లో రూ.10 వేలు జమ అవుతాయని వార్తలు వస్తున్నాయి.  పంట నష్ట బాధితులకు పరిహారం కింద రూ.15.81 కోట్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.

Show comments