బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కు... ఏకంగా రూ.40కోట్లు..!

బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కు… ఏకంగా రూ.40కోట్లు..!

కొందరు తమ అమాయకపు ఫేస్ ను పెట్టుబడిగా పెట్టి.. జనాలను నిండ ముంచేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా అలానే బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కై.. ఏకంగా రూ.40 కోట్లను కొల్లగొట్టాడు.

కొందరు తమ అమాయకపు ఫేస్ ను పెట్టుబడిగా పెట్టి.. జనాలను నిండ ముంచేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా అలానే బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కై.. ఏకంగా రూ.40 కోట్లను కొల్లగొట్టాడు.

ప్రస్తుతం కాలంలో చాలా మంది ఈజీగా డబ్బులు సంపాదించాలనే భావనలో ఉంటున్నారు. ఈ క్రమంలో దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఇక కొందరు అయితే ఎంతో అమాయకంగా కనిపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. తమ అమాయకపు ఫేస్ ను పెట్టుబడిగా పెట్టి.. జనాలను నిండ ముంచేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా అలానే బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కై.. ఏకంగా రూ.40 కోట్లను కొల్లగొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ లోని శంషాబాద్ ప్రాంతంలో ఇండస్ ఇండ్ అనే బ్యాంకులో రామస్వామి అనే వ్యక్తి మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే డెలివరీ మేనేజర్ రాజేశ్ తో కలిసి బ్యాంకుకు రూ.40 కోట్లు నష్టం చేశారని ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రాంతీయ అధికారి మణికందన్ రామనాధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రామస్వామి, రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి

ఆర్థిక మోసాల్లో బాగా ఆరితేరిన బషీద్ డబ్బు కోసం రామస్వామితో కలిసి ప్లాన్ వేశాడు. డబ్బు బదిలీ చేస్తే ప్రతిఫలం ఇస్తానని ఆశ చూపాడు. రామస్వామి, రాజేశ్‌ లు ఆదిత్య బిర్లా సంస్థ అకౌంట్ లోని 40 కోట్లను ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి ఖాతాలకో బదిలీ చేశారు. ఆ తర్వాత బషీద్‌ ఆ నగదు ఇతర అకౌంట్లకు  బదిలీ చేశాడు. ఈ క్రమంలో అలా వచ్చిన డబ్బులతో నిందితుడు బషీద్‌ రెండు కార్లు కొనుగోలు చేశాడు. తాను చేసిన మోసానికి సాయం చేసిన బ్యాంకు మేనేజర్ రామస్వామికి కారును  గిఫ్ట్ గా ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈకేసులో ఏ3గా ఉన్న బషీద్‌ను సైబరాబాద్‌ పోలీసులు దిల్లీలో అరెస్టు చేసి..నగరానికి తీసుకొచ్చారు.

ఆదిత్యా బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థకు ముంబై నారీమన్‌పాయింట్‌ ప్రాంతంలోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు శాఖలో అకౌంట్ ఉంది. ఆ సంస్థ పర్మిషన్ లేకుండానే అకౌంట్ నుంచి జులై 12వ తేదీ నుంచి 40 కోట్లు విత్‌ డ్రా అయ్యాయి. ఈ క్రమంలోనే అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన  బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శంషాబాద్‌ బ్రాంచి మేనేజర్‌ రామస్వామి, బ్యాంకు ఉద్యోగి రాజేశ్‌ డబ్బులను పక్కదారి పట్టించినట్లు తేలింది. జులై 15వ తేదీ నుంచి బ్యాంకు మేనేజర్‌ రామస్వామి విధులకు రావడం లేదు. అనుమానమొచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితులు రామస్వామి, రాజేశ్‌ను గతనెల 24వ తేదీన అరెస్టు చేశారు. వారిని విచారించగా బషీద్‌ హస్తం బయటపడింది.

Show comments