Rain Alert: తెలంగాణకు రెయిన్‌ అలర్ట్‌.. వరుసగా 5 రోజులు వాన

నైరుతు రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

నైరుతు రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేశాయి. జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే జూన్‌ నెల ఆరంభం నుంచే వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నైరుతు రుతుపవనాలు విస్తరించాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జోరు వానలు కురిశాయి. అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఇక గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అంతేకాక జనాలు జాగ్రత్తగా ఉండాలని.. చెబుతూ ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలంగాణకు రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. రానున్న ఐదు రోజులు అనగా నేటి నుంచి జూన్‌ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తాయిని.. చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో కూడా ఉండటం వల్ల.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. అంతేకాక గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వ్యవసాయ, ఇతరాత్ర పనుల కోసం బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోందని.. ఆవర్తనం కారణంగా తెలంగాణతో పాటు ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ఆసిఫాబాద్‌, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయి అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు.

ఇక మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రిపూట జల్లులు పడ్డాయి. ఇక బుధవారం ఉదయం నుంచి నగరంలో వాతావరణ మేఘావృతం అయి ఉంది. ఏ క్షణమైన జో రు వర్షం కురిసేలా ఉంది.భారీ వర్షాలు కారణంగా రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రమాదం ఉందని అవసరం అయితేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు సూచించారు.

Show comments