Dharani
IMD Rain Alert: తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. మూడు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయని తెలిపారు. ఆ వివరాలు.
IMD Rain Alert: తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. మూడు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయని తెలిపారు. ఆ వివరాలు.
Dharani
రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించాయి. దాంతో జూన్ నెల ప్రారంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. దీనికి తోడు బంగళాఖాతంలో ద్రోణి కారణంగా వరుసగా జోరు వానలు కురుస్తుంటాయి. ఈ క్రమంలో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అదికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రుతుపవనాలకు తోడు.. బంగాళఖాతంలో ద్రోణి ఏర్పడిన కారణంగా రానున్న మూడు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయని.. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆ వివరాలు..
తెలంగాణకు వాతావరణశాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో నేటి నుంచి అనగా సోమవారం నుంచి రానున్న మూడ్రోజుల పాటు.. రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఈ ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులకు తోడు గంటకు 30-40 కి.మీతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. అందుకే బయట పనులకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇక నేడు ములుగు, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, మెదక్, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈక్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఈ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రం తర్వాత జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ఇక కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన పడింది. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉండటంతో.. రైతులు, పొలం పనులకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని.. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచించారు.