hyderabad chilkalguda latest crime news: వీడియో: HYDలో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన కారు!

వీడియో: HYDలో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన కారు!

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి రోడ్డుపై డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ పై కారు దూసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి రోడ్డుపై డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ పై కారు దూసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి రోడ్డుపై డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ పై కారు దూసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ప్రమాదం ఎలా జరిగిందంటే? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రోడ్లపై హిట్ అండ్ రన్ లో చేపట్టారు.

ఇందులో భాగంగానే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ అన్ని కార్లను విస్తృతంగా తనిఖీ చేస్తూ బంగారు అభరణాలు, నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు భారీ మొత్తంలో నగదును సీజ్ చేశారు. అయితే నగరంలోని చిలకలగూడలో పరిధిలోని ఓ ప్రాంతంలో ఈ నెల 18న రాత్రి పోలీసులు హిట్ అండ్ రన్ చేపట్టారు. మహేష్ అనే కానిస్టేబుల్ విధుల్లో పాల్గొన్నాడు. ముందుగా ఓ బైక్ రావడంతో దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. కానీ, అతడు ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. ఇదే సమయంలో దాని వెనకాల మరో కారు రావడంతో కానిస్టేబుల్ మహేష్ దానికి అడ్డుగా నిలబడ్డాడు.

అయినా ఆపని ఆ కారు డ్రైవర్ అలాగే మహేష్ పైకి ఎక్కించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. తోటి ఉద్యోగులు వెంటనే అప్రమత్తమై అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

Show comments