చంపిన వాడు ఉన్మాదే.. ప్రాధేయపడ్డా కాపాడని ఈ అమ్మాయిలని ఏమంటారు?

Bengaluru: మూడు రోజుల క్రితం బెంగళూరులోని ఓ పీజీలో యువతిని ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ బయటకు వచ్చింది. ఆ దృశ్యాలను చూస్తూ.. సమాజం ఎటు వెళ్తుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Bengaluru: మూడు రోజుల క్రితం బెంగళూరులోని ఓ పీజీలో యువతిని ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ బయటకు వచ్చింది. ఆ దృశ్యాలను చూస్తూ.. సమాజం ఎటు వెళ్తుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో నేరాలు అనేవి చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలపై  వివిధ రకాల దారుణాలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇంకా మహిళపై అఘాయిత్యాలు అనేవి జరుగుతున్నాయి. మంగళవారం కర్నాటక రాష్ట్రంలోని బెంగళురు నగరంలో 22 ఏళ్ల యువతిని ఓ యువకుడు హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. తాజాగా ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలను చూసిన సామాన్యులకు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. అసలు ఏం జరిగిదంటే…

బీహార్‌కు చెందిన కృతి కుమారి అనే 22 ఏళ్ల యువతి ఉద్యోగం కోసం బెంగళూరు నగరానికి వచ్చింది. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం  చేస్తుంది. అలానే కోరమంగళ ప్రాంతంలోని లేడీస్ పీజీ వసతి గృహంలో ఉంటుంది.  ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ యువకుడు మూడో అంతస్తులోకి ప్రవేశించాడు. అక్కడే ఉన్న కుమారిని వాగ్వాదం పెట్టుకున్నాడు. ఇదే సమయంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో కుమారిని పలుమార్లు పొడిచాడు.

అయితే అతడు కత్తితో పొడుస్తున్న.. తప్పించుకునేందుకు ఆ యువతి ఎంతో ప్రయత్నించింది.  చాలా సమయం పాటు అతడి కత్తిపోట్లు తగులుతున్న.. ప్రాణాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అతడు చంపి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇది ఇలా ఉంటే.. యువతిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.  ఆ యువతిని  దారుణంగా చంపిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. సీసీ పుటేజ్ చూసిన కొన్ని విషయాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉన్మాది దాడి చేసిన తరువాత చాలా సమయం పాటు ఆ యువతి రక్షించండి.. రక్షించండి అంటూ కేకలు వేసింది. కానీ అదే పీజీలో ఉన్న కొందరు యువతులు ఆ బాధితురాలిని చూస్తూనే ఉన్నారు. కానీ  ఏ  ఒక్కరు ఆ యువతి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయలేదు.

ఆ సంఘటన చూసి..భయభ్రాంతులకు గురై ఉండొచ్చు, మరేదైనా కారణం అయ్యి ఉండొచ్చు. కానీ ఆ యువతి కత్తిపోట్లకు గురైనా తరువాత కూడా చాలా సమయం  పాటు ప్రాణాలతో ఉంది. అదే సమయంలో తోటి యువతులు ధైర్యం చేసి.. ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే..కథ మరోలా ఉండేది. ఆ ఉన్మాది దాడి చేసే సమయంలో వెళ్లలేకపోయారు అంటే ఆయుధం ఉందనే భయంతో అని అనుకోవచ్చు. కానీ అతడు వెళ్లి పోయిన తరువాత కూడా ఆ బాధితురాలి దగ్గరకి వెళ్లే ప్రయత్నం తోటి యువతులు చేయాలేదు. ఈ  ఘటన చూసిన వాళ్లు సమాజం ఎటువైపు వెళ్తుందా అనే  ఆవేదను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments