కుప్పకూలిన గ్రీన్‌ ఫీల్డ్ హైవే బ్రిడ్జి.. పలువురికి గాయాలు!

ఇటీవల నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీలు కూలిపోయి పెను ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. నాణ్యతా లోపం, ప్రకృతి ప్రభావం వల్ల వంతెనలు కూలిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవల నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీలు కూలిపోయి పెను ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. నాణ్యతా లోపం, ప్రకృతి ప్రభావం వల్ల వంతెనలు కూలిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరూ ఊహంచలేరు. ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి.. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోలుతున్నారు. కొన్నిసార్లు మానుషులు చేసే తప్పిదాలు, ప్రకృతి విపత్తుల వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రయాణ సౌకర్యం కోసం బ్రిడ్జీ నిర్మాణం చేపడుతుంటారు. కొన్నిసార్లు వంతెన నిర్మాణాల్లో నాణ్యతా లోపాల కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఖమ్మంలో ఓ బ్రిడ్జీ నిర్మాణం ఒక్కసారిగా కూలిపోయింది. వివరాల్లోకి వెళితే..

ఖమ్మం జిల్లా నుంచి అశ్వరావు పేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కి చెందిన ఓ బ్రిడ్జీ నిర్మాణ దశలో ఉండగానే హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ బ్రిడ్జీ నిర్మాణంలో ఉన్న నలుగురు కార్మికులు ఒక్కసారిగా కిందకు దూకి తమ ప్రాణాలు దక్కించుకున్నారు. ఇప్పటికే సూర్యపేట మీదుగా ఖమ్మం వరకు నేషనల్ హైవే నిర్మాణం పూర్తయ్యింది.. ఖమ్మం నుంచి వైరా సత్తుపల్లి అశ్వరావు పేట వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుంది. ఈ క్రమంలోనే వైరా వద్ద బ్రిడ్జీ నిర్మాణాన్ని చెపడుతున్నారు. తాజాగా వైరా నుంచి తల్లాడకి వెళ్తున్న రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జీ నిర్మాణం కొనసాగుతుంది.  ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ బ్రిడ్జీ ఎందుకు కూలిపోయిందన్న విషయంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం బ్రిడ్జీ నిర్మాణం వద్ద ఎక్కువగా జనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని అంటున్నారు. హైవే బ్రిడ్జీ పనుల్లో నాణ్యతా లోపాలు, నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవొచ్చని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments